CM Revanth Reddy : ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీగా ఉన్నారు ఢిల్లీ పర్యటనలో .ఈ సందర్బంగా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన దేశ రాజధానిలో మీడియాతో మాట్లాడారు. ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం, హెల్త్ జోన్, ఎడ్యుకేషన్ జోన్ సహా తొమ్మిది జోన్లు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలోని ఉత్తమ ప్రణాళికా బద్ధమైన పట్టణ కేంద్రాలలో ఒకటైన భారత్ ఫ్యూచర్ సిటీని తెలంగాణ నిర్మిస్తున్నట్లు చెప్పారు సీఎం. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సభ్యులతో కూడిన ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
CM Revanth Reddy Comments
మొదటి దశలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ అత్యంత కీలకంగా ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. దీని కోసం మొత్తం రాష్ట్రాన్ని జోన్ చేయడానికి తమకంటూ ఒక వ్యూహం ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 160 కి.మీ మేర అర్బన్ ప్రాంతం ఉంటుందన్నారు.ఔటర్ రింగ్ రోడ్డు , కొత్త ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్య 360 కిలోమీటర్ల మేర సెమీ అర్బన్ తయారీ జోన్ గా తయారు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆర్ఆర్ఆర్ వెనుక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉంటుందన్నారు. భవిష్యత్తు నీరు, వాతావరణ సంక్షోభాన్ని ఉత్తమంగా నిర్వహించగల నగరాలదేనని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవనం, పునరుద్దరణ , సరస్సులను కాపాడటం ద్వారా అర్బన్ వాటర్ గ్రిడ్ ను సృష్టించ బోతున్నట్లు చెప్పారు.
Also Read : Trump Shocking Comments : ఔను పాకిస్తాన్ ఇండియా యుద్దాన్ని నేనే ఆపా
