Trump Shocking Comments : ఔను పాకిస్తాన్ ఇండియా యుద్దాన్ని నేనే ఆపా

మ‌రోసారి నోరు పారేసుకున్న అమెరికా చీఫ్ ట్రంప్

Hello Telugu - Trump Shocking Comments

Hello Telugu - Trump Shocking Comments

Trump : అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న త‌న అక్క‌సును ఆపు కోవ‌డం లేదు. శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన‌కుండా, యుద్దానికి దారితీయ‌కుండా తాను ప్ర‌య‌త్నం చేశాన‌ని, దీంతో యుద్దం మ‌ధ్య‌లోనే ముగిసింద‌న్నారు. తాను గ‌నుక చెప్ప‌క పోతే, హెచ్చ‌రించ‌క పోయి ఉండివుంటే పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌రిగి ఉండేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొన్ని రోజులుగా ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు. త‌న వైఖ‌రిలో మార్పు రావ‌డం లేదు. ఆయ‌న ఓ వైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న‌కు స్నేహితుడ‌ని చెబుతూనే మ‌రో వైపు సుంకాల విధింపున‌కు తెర తీశాడు. ఇదే స‌మ‌యంలో ఎందుకు ఇండియాను టార్గెట్ చేశార‌ని అడిగిన మీడియా ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు ట్రంప్.

Trump Shocking Comments

పాకిస్తాన్, ఇండియా రెండు దేశాలు అణ్వాయుధాలు క‌లిగి ఉన్నాయ‌ని ఈ రెండు గ‌నుక త‌ల‌ప‌డితే భారీ ఎత్తున ప్ర‌పంచానికి ప్ర‌మాదం వాటిల్ల‌నుంద‌ని అందుకే తాను ఎంట‌ర్ కావాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ట్రంప్ కు శాంతి బ‌హుమ‌తి ఇవ్వాలని వైట్ హౌస్ ప్ర‌తినిధులు కోరుతున్నారు. ట్రంప్ అమెరికాకు రెండోసారి దేశ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక ప్ర‌పంచంలో చాలా చోట్ల ఘ‌ర్ష‌ణ‌ల‌ను నివారించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని వైట్ హౌస్ కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ భార‌త్, పాకిస్తాన్ యుద్దానికి సంబంధించి చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించింది కేంద్రం. అలాంటి ప్ర‌య‌త్నాలు ఏవీ చేయ‌లేద‌ని పేర్కొంది.

Also Read : Kazakhstan Ambassador Important Meet : తెలంగాణాలో వాణిజ్య ఒప్పందాలపై గవర్నర్ ను కలిసిన అజామాత్

Exit mobile version