KTR Shocking Comments on Congress : బ‌ట్ట‌లిప్పి కొట్ట‌డ‌మే ఇందిర‌మ్మ పాలనా..?

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-ktrslams

KTR : హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి విసిరిన స‌వాల్ ను తాను స్వీక‌రిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు మాజీ మంత్రి కేటీఆర్. వ్యవసాయాన్ని పండుగలా చేసింది ఎవరో తెలంగాణలో ఏ రైతును అడిగినా చెప్తారని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణను నెంబర్ వన్ చేసింది కేసీఆర్ అన్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అన్నారు. స‌వాళ్లు, బూతులు, డైలాగులు రేవంత్ కు అల‌వాటుగా మారింద‌న్నారు. రాష్ట్రంలో ఏపీకి చెందిన కోవ‌ర్టుల పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. జ‌నం చూస్తూ ఊరుకోర‌ని త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.

KTR Shocking Comments

శ‌నివారం హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్ (KTR). నిన్న జ‌రిగిన న్యాయ భేరి స‌భ‌లో త‌న గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించాడ‌ని, అంతే కాకుండా స‌వాల్ విసిరాడ‌ని , ద‌మ్ముంటే రావాల‌ని పిలుపునిచ్చినందుకే తాను ఇవాళ మీ ముందుకు వ‌చ్చాన‌ని చెప్పాడు. సీఎం ఎక్క‌డ చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్నా తాము వ‌చ్చేందుకు రెడీగా ఉన్నామ‌ని అన్నారు. కేసీఆర్ వ‌స్తాడా లేక కేటీఆర్ వ‌స్తాడా ఆయ‌నే అన్నార‌ని, 8వ తేదీన సోమాజిగూడ లోని ప్రెస్ క్ల‌బ్ లో 11 గంట‌ల‌కు తాను రెడీగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

మీడియా ముందు అన్నింటిని బ‌హిరంగంగా చర్చించేందుకు సిద్ద‌మై ఉన్నామ‌ని తెలిపారు. గ‌త 10 ఏళ్ల కాలంలో రూ. 73 వేల కోట్ల‌ను రైతుల ఖాతాల్లో జ‌మ చేశామ‌న్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చాక రైతుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని, రైతు భ‌రోసా కింద రూ. 15 వేలు ఇస్తామ‌ని చెప్పి మోసం చేశాడ‌ని ఆరోపించారు. 2 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పాడ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 11 వేలు మాత్ర‌మే భ‌ర్తీ చేసి 60 వేలు నింపామంటూ అన్నీ అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని ఫైర్ అయ్యారు.

Also Read : Chief Justice Gavai Transparency : పార‌దర్శ‌క‌త‌కు ప్రాధాన్యం న్యాయ‌మూర్తుల‌ నియామ‌కం

Exit mobile version