Chief Justice Gavai : ముంబై – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జీల ఎంపికలో పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు. పెద్ద ఎత్తున కేసులు పెండింగ్ లో ఉండేందుకు ప్రధాన కారణం న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయక పోవడమేనని పేర్కొన్నారు. కేసుల పెండింగ్‌ను తగ్గించడానికి బాంబే హైకోర్టు పూర్తి బలంతో పని చేయడం ప్రారంభించేలా తాను ప్రయత్నిస్తానని జస్టిస్ గవాయ్ (Chief Justice Gavai) అన్నారు. తన ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం జడ్జీల నియామకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుభవం, అర్హతలను ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తామన్నారు.
Chief Justice Gavai Comments
అయితే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను తాను పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు జస్టిస్ గవాయ్. ముంబైలోని బాంబే హైకోర్టు భవనం రెండవ అంతస్తులోని సెంట్రల్ కోర్టు రూమ్ (నంబర్ 46)లో జరిగిన బాంబే బార్ అసోసియేషన్ సన్మాన సభలో సీజేఐ గవాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇద్దరు అదనపు న్యాయమూర్తులు జస్టిస్ గౌతమ్ అంఖద్, మహేంద్ర నెర్లికర్ ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. బాంబే హైకోర్టు ఇప్పుడు 65 మంది న్యాయమూర్తులతో పనిచేస్తుందన్నారు. దీని వల్ల కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
ప్రస్తుతం బాంబే హైకోర్టులో 49 మంది శాశ్వత న్యాయమూర్తులతో పాటు 16 మంది అదనపు జడ్జీలు పని చేస్తున్నారని చెప్పారు సీజేఐ. దేశంలో అత్యధిక జడ్జీలను కలిగి ఉన్నది మాత్రం అలహాబాద్ హైకోర్టు అని వెల్లడించారు. ఇందులో 94 మంది జడ్జీలు పని చేస్తున్నారని అన్నారు సీజేఐ. జస్టిస్ సంజీవ్ ఖన్నా కాలం నుండి, న్యాయమూర్తుల నియామకాల విషయంలో మరింత పారదర్శకతను తీసుకు వచ్చేందుకు తాము ప్రయత్నం చేశామన్నారు.
Also Read : AP Govt Interesting Update : తల్లులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు
