KTR fired on CM Revanth Reddy : స‌వాల్ విసిరి పారి పోయిన స‌న్నాసి రేవంత్ రెడ్డి

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-ktr

KTR  : హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మ‌రోసారి తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ద‌మ్ముంటే రా అని స‌వాల్ విసిరాడ‌ని, కానీ చివ‌ర‌కు స‌మాధానం చెప్ప‌లేక పారి పోయాడంటూ ఎద్దేవా చేశారు. త‌న‌ను ఓ స‌న్నాసి అంటూ సంబోదించాడు కేటీఆర్ (KTR). బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎవ‌రైనా ఛాలెంజ్ విసిరితే దానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని కానీ రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడ‌టం అలా వెళ్లి పోవ‌డం ప‌రిపాటిగా మారింద‌న్నారు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించ లేద‌న్నారు.

KTR Slams CM Revanth Reddy

ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి, నన్ను కోసుకుతింటారా అంటూ ప్రజల మీద రంకెలు వేస్తున్నాడని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు రేవంత్ రెడ్డికి మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదన్నారు. రాజకీయాల్లో తిట్లు వాడడం మాకు ఇష్టం లేదని, కానీ త‌న‌కు ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుందన్నారు కేటీఆర్. ద‌య‌చేసి ప్ర‌జ‌లు అర్థం చేసుకుని త‌మ‌తో స‌హ‌క‌రించాల‌ని కోరారు మాజీ మంత్రి. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డం చేత‌కాని ద‌ద్ద‌మ్మ ఈ రేవంత్ రెడ్డి అంటూ భ‌గ్గుమ‌న్నారు. ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్నింగ్ ఇచ్చారు. ఏం ముఖం పెట్టుకుని లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు వెళ‌తాడ‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.

Also Read : Popular ICC Test Rankings : బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో జో రూట్ నెంబ‌ర్ వ‌న్

Exit mobile version