Jagadish Reddy Fired on MLC Kavitha : ఎమ్మెల్సీ క‌విత‌పై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీష్ రెడ్డి

స్థాయికి త‌గ్గ‌ట్టు మాట్లాడితే మంచిద‌ని హిత‌వు

Hello Telugu - Jagadish Reddy Fired on MLC Kavitha

Hello Telugu - Jagadish Reddy Fired on MLC Kavitha

Jagadish Reddy : హైద‌రాబాద్ – మాజీ మంత్రి జ‌గ‌దీష్‌ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్సీ క‌విత‌పై. త‌న‌ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఎద్దేవా చేశారు. తాను చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచాను కానీ కొందరు అసలు గెలవలేదు కదా అని ప్ర‌శ్నించారు. చాలా సార్లు కేసీఆర్ ను క‌లిశాన‌ని, ఆమె గురించి చ‌ర్చ జ‌ర‌గ లేద‌న్నారు. 25 ఏళ్ల నుండి పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడిగా ఉన్నాన‌ని చెప్పారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న గురించి మ‌రింత జుగుస్సాక‌రంగా, వ్య‌క్తిగ‌త ఇమేజ్ కు డ్యామేజ్ క‌లిగేలా క‌విత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Jagadish Reddy Slams MLC Kavitha

ఎవ‌రు ఏమిటో తెలుసు కోకుండా ఎవ‌రో ఏదో చెబితే అదే నిజ‌మ‌ని న‌మ్మి ఇత‌రుల‌పై రాళ్లు వేయాల‌ని అనుకోవ‌డం స‌బ‌బు కాద‌న్నారు క‌విత‌ను ఉద్దేశించి . తాను న‌క్సలైట్ ఉద్య‌మం నుంచి వ‌చ్చిన వాడిన‌ని, త‌న‌కంటూ ఓ చ‌రిత్ర ఉంద‌న్నారు. ఎవ‌రి చ‌రిత్ర ఏమిటో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. 2001 నుండి ఇప్పటివరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన గెలుపు ఓటములకు త‌న‌దే బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు జ‌గ‌దీష్ రెడ్డి. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకొని, ఓడిపోగానే పారిపోయే రకం కాదు తానంటూ చెప్పారు మాజీ మంత్రి. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ మాట్లాడిన మాటల లాగానే కవిత మాటలు కూడా ఉన్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : Minister Komatireddy Shocking Comments : బనకచర్లను అడ్డుకుంటాం కేంద్రంతో కొట్లాడుతాం

Exit mobile version