KCR Sensational Comments : బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ ఆందోళ‌న

నిరంత‌రం స‌మీక్ష చేస్తున్న మాజీ సీఎం

hellotelugu-kcr

KCR : హైద‌రాబాద్ – ఓ వైపు ఆరోగ్యం బాగా లేక పోయినా మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) తెలంగాణ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గోదావ‌రి, కృష్ణా జ‌లాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించుకు పోయేందుకు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్లాన్ చేశాడు. ఆపై డీపీఆర్ కూడా సిద్దం చేశాడు. కేంద్రంలో త‌మ స‌పోర్ట్ తో మోదీ స‌ర్కార్ కొన‌సాగుతుండ‌డంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, నీటి పారుద‌ల శాఖ మంత్రి, సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ పై ఒత్తిడి పెంచి ప్రాజెక్టు చేప‌ట్టేందుకు ముందుకు సాగుతుండ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వ‌స్తోంది భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ.

Ex CM KCR Key Comments

ఇప్ప‌టికే కేంద్రానికి, కేంద్ర వాట‌ర్ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమ‌తులు లేకుండా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును ఎలా చేప‌డ‌తారంటూ ప్ర‌శ్నించింది సీడ‌బ్ల్యూసీ. ఈ మేర‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. అంతే కాదు పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించకుండా ఎలా మాట్లాడ‌తారంటూ ప్ర‌శ్నించింది. దీంతో ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. అయినా చంద్ర‌బాబు నాయుడు ఆగ‌డం లేదు. ఆయ‌న‌తో పాటు త‌న ప‌రివారం మొత్తం తెలంగాణ‌పై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్.

ఈ మేర‌కు నందిన‌గ‌ర్ లోని త‌న నివాసంలో సీరియ‌స్ గా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వారం రోజుల నుంచి పార్టీ సీనియ‌ర్ నేత‌లు, మేధావులు, నీటి పారుద‌ల రంగ నిపుణుల‌తో చ‌ర్చించారు.
కాళేశ్వరం జలాల కోసం ఎదురు చూస్తున్న పొలాలు.. అదునుకు పదునందక రైతన్న అరిగోస పట్ల కేసీఆర్ ఆందోళన వ్య‌క్తం చేశారు. తెలంగాణ గోదారిని పరీవాహక ప్రాంతాన్ని మరోమారు ఎడారిగా మార్చే బనకచర్ల నిర్మాణం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తగు కార్యాచరణ కోసం సంసిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో వర్తమాన రాజకీయ పరిస్థితులను జిల్లాల వారీగా ఆరా తీశారు.

Also Read : Harish Rao Shocking Comments : సీఎం..ద‌మ్ము లేక దాక్కుంటే ఎలా..?

Exit mobile version