Harish Rao Shocking Comments : సీఎం..ద‌మ్ము లేక దాక్కుంటే ఎలా..?

నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Hello Telugu - Harish Rao Shocking Comments

Hello Telugu - Harish Rao Shocking Comments

Harish Rao : హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao) సీరియ‌స్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. తాము చేసిన ఛాలెంజ్ ను స్వీక‌రించే ద‌మ్ము లేక అడ్డ‌గోలుగా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రజాభవన్ సాక్షిగా ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు త‌న‌ను క్షమించర‌ని అన్నారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్‌ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు హ‌రీశ్ రావు.

MLA Harish Rao Slams CM Revanth Reddy

కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధిని ప్ర‌దర్శిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. చర్చకు పిలిచే దమ్ము లేకనే ప్రజా భవన్‌లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యావంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ప్రీవిలేజ్‌కు భంగం కల్పించినందుకు శాసనసభ, శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నార‌ని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి పనికి రాని పీపీటీలతో మరోసారి త‌మ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు.

నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలతో, తప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసిందేం లేదన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారుతారా? మీ అబద్ధాలను చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని పేర్కొన్నారు.

Also Read : Minister Atchannaidu Warning : ప్ర‌చారం కోస‌మే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు – అచ్చెన్న

Exit mobile version