ఆగ‌స్టు 13 నుండి విజ‌య‌వాడ నుండి విమాన సర్వీసులు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్

hellotelugu-IndigoFlightss

విజ‌య‌వాడ : ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విమాన ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఆగస్టు 13 నుండి విజయవాడ-వారణాసి, కోల్‌కతా మధ్య ఇండిగో విమాన సర్వీసులు న‌డుపుతుంద‌ని వెల్ల‌డించారు. కందుల దుర్గేష్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ కొత్త విమాన మార్గాలను ప్రకటించారు. తిరుగు ప్రయాణ విమానం (6E 6501) మధ్యాహ్నం 2:10 గంటలకు కోల్‌కతా నుండి బయలుదేరి, వారణాసిలో ఆగి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంద‌న్నారు. విజయవాడ: ఆగస్టు 13 నుండి వారణాసి , కోల్‌కతాలకు ఇండిగో సంస్థ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడంతో విజయవాడ నుండి విమాన రవాణా సౌకర్యాలు మెరుగు పడనున్నాయని తెలిపారు కందుల దుర్గేష్. ఈ విమానాలు ప్రతి మంగళ, గురు ,శనివారాల్లో నడుస్తాయని పేర్కొన్నారు.

ఈ సర్వీసులు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పర్యాటకం, తీర్థయాత్రలు, వాణిజ్యం , పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు. ఇండిగో వివరాల ప్రకారం విమానం 6E 6502 సాయంత్రం 6:20 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసికి చేరుకుంటుంది, ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లి రాత్రి 10:15 గంటలకు అక్కడ దిగుతుంది. తిరుగు ప్రయాణ విమానం 6E 6501 మధ్యాహ్నం 2:10 గంటలకు కోల్‌కతా నుండి బయలుదేరి, వారణాసిలో ఆగి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆధ్యాత్మిక నగరమైన వారణాసి , చారిత్రక నగరమైన కోల్‌కతాతో రవాణా అనుసంధానాన్ని మెరుగు పరచడంతో పాటు, పర్యాటకం, వాణిజ్యం , ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ కొత్త సర్వీసులు కొత్త అవకాశాలను కల్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version