Fiji : ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో ఉన్న ఫిజీ (Fiji) ప్రధాని రబూకా కీలక ప్రకటన చేశారు. అమెరికా సుంకాల వివాదం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఓ వైపు ఇండియాపై పనిగట్టుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలను విధించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. పూర్తిగా అప్రజాస్వామికమని, తమ దేశం ఖండిస్తుందన్నారు. ‘శాంతి మహా సముద్రం’ అనే అంశంపై ప్రసంగించారు. ఎవరూ మీతో సంతోషంగా లేరని, ఆ విషయం ట్రంప్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఎన్నిసుంకాలను విధించినా తట్టుకునే శక్తి ఇండియాకు ఉందన్నారు. తమ రెండు దేశాల మధ్య విడదీయలేని బంధం నెలకొందన్నారు. అయినా అమెరికా బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Fiji PM Support
మోడీతో తన సంభాషణ వివరాలను రబుకా పంచుకున్నారు. ఈ ఉపన్యాసాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ నిర్వహించింది. సముద్ర భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ , సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో భారతదేశంతో ఫిజి సంబంధాలను బలోపేతం చేయడానికి తాను ఢిల్లీకి రావడం జరిగిందన్నారు రబూకా. భారతదేశం, ఫిజి రక్షణ సంబంధాలను పెంపొందించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ధృవీకరించాయని ఒప్పుకున్నారు . మొత్తం ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి చర్చలు జరిపినందున శాంతియుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ కోసం సంయుక్తంగా పని చేయడానికి అంగీకరించాయి.
తాను యుఎస్ చీఫ్ తో మాట్లాడలేదు. రష్యా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం కోసం అడిగాను. నేను యుకె ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించానని రబుక చెప్పారు.
Also Read : Tirumala Temple Close Shocking : సెప్టెంబర్ 7న శ్రీవారి ఆలయం మూసివేత
















