Popular FIFA World Cup : ఫిఫా ప్ర‌పంచ క‌ప్ బంతి ఆవిష్క‌ర‌ణ

బంతిని త‌యారు చేసిన అడిడాస్

Hello Telugu - Popular FIFA World Cup

Hello Telugu - Popular FIFA World Cup

FIFA World Cup : న్యూయార్క్ : ప్ర‌పంచంలోనే అత్య‌ధిక అభిమానుల‌ను క‌లిగిన సాక‌ర్ సంబురానికి వేళైంది. ఈ మేర‌కు ఏర్పాట్లు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కంపెనీ అడిడాస్ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ (FIFA World Cup) కు సంబంధించి త‌యారు చేసిన బంతి (బాల్) ను ఆవిష్క‌రించింది. ఈ కంపెనీ జ‌ర్మ‌నీకి చెందిన‌ది. ఈ కంపెనీ గ‌త 1970వ సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఫుట్ బాల్ టోర్నీ నుంచి అధికారికంగా బంతుల‌ను త‌యారు చేస్తూ వ‌స్తోంది. ఇదిలా ఉండగా ఈసారి ట్రియోండా అని వ‌ర‌ల్డ్ క‌ప్ కు పేరు పెట్టారు. న్యూయార్క్ లో ఆవిష్క‌రించ‌డంతో పెద్ద ఎత్తున అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. వ‌చ్చే ఏడాది 2026వ సంవ‌త్స‌రంలో అమెరికా వేదిక‌గా ఈ ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈసారి ఈ ఫిఫా క‌ప్ (FIFA World Cup) ను మూడు దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెన‌డా, మెక్సికోలు పాలు పంచుకుంటున్నాయి. భారీ ఎత్తున ఈసారి ఛాంపియ‌న్ గా నిలిచే జ‌ట్టు ప్రైజ్ మ‌నీ అందుకోనుంది.

FIFA World Cup Ball Updates

ట్రియోండాను ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉందన్నారు ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వాహ‌క అధ్య‌క్షుడు జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. మూడు దేశాలు నిర్వహించిన మొదటి ప్రపంచ కప్ లో 48 జట్లు పోటీపడ్డాయి, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన బంతి పేరు , రూపకల్పన రెండింటినీ ప్రేరేపించేలా చేశాయి. ప్రతి ఆతిథ్య దేశం నుండి ఐకానోగ్రఫీ, కెనడా నుండి మాపుల్ ఆకులు, మెక్సికో నుండి డేగ, యునైటెడ్ స్టేట్స్ నుండి నక్షత్రాలు కూడా ఉన్నాయి. మూడు దేశాల ఐక్యతను సూచించే త్రిభుజం కూడా ఉంది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి జూలై 19 వరకు ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంంది. ఆన్ లైన్ లో ద‌శ‌ల వారీగా టికెట్ల అమ్మ‌కాల‌ను ఇప్ప‌టి నుంచే ప్రారంభించింది. 216 దేశాలు, 4.5 మిలియ‌న్ల‌కు పైగా ఫ్యాన్స్ హాజ‌ర‌వుతార‌ని క్రీడా వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : RSS Chief Bhagwat Important Comments : వ్య‌క్తిత్వ వికాసం ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం

Exit mobile version