Beauty Fatima Sana Shaikh : మాధ‌వ‌న్ తో న‌టించ‌డం అద్భుతం : స‌నా షేక్

ఆప్ జైసా కోయిలో తెర పంచుకోవ‌డం సంతోషం

Hello Telugu - Beauty Fatima Sana Shaikh

Hello Telugu - Beauty Fatima Sana Shaikh

Fatima Sana Shaikh : బాలీవుడ్ న‌టి ఫాతిమా స‌నా షేక్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ప్ర‌ముఖ త‌మిళ సినీ న‌టుడు ఆర్. మాధ‌వ‌న్ తో తెర పంచుకోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసింది. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సంద‌ర్బంగా త‌ను అభిప్రాయాల‌ను పంచుకుంది. 30 సంవ‌త్సరాల త‌ర్వాత పెళ్లి ప‌ట్ల మారుతున్న సామాజిక అవగాహ‌నల గురించి ఇందులో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం జ‌రిగింద‌న్నారు. మార్పు అన్న‌ది స‌హ‌జం. దీనిని ఎవ‌రూ కాద‌లేని స‌త్యం. కొన్ని క‌ట్టుబాట్లు ఉంటాయి. అవి కూడా రోజు రోజుకు మారి పోతుంటాయ‌ని, అలా అని వాటిని కాద‌న‌లేరు ఎవ‌రూ అని పేర్కొంది న‌టి ఫాతిమా స‌నా షేక్.

Fatima Sana Shaikh Comments

ప్ర‌స్తుతం ఆప్ జైసా కోయి ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, పెళ్లి గురించి ఫోక‌స్ పెట్టింది. సమాజం, వారి అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు, ఎలా అభివృద్ది చెందుతున్నాయో ఇందులో ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పింది న‌టి.

నిషిద్ధం ఇప్పటికీ కొంతవరకు ఉన్న మాట వాస్త‌వం. అయితే నేటి ప్రపంచంలో వ్యక్తిగత ఎంపికలు, మారుతున్న సంబంధాల గతిశీలతకు పెరుగుతున్న అంగీకారం ఉందని ఫాతిమా స‌నా షేక్ (Fatima Sana Shaikh) అంగీకరించింది. నిషిద్ధం గురించి మాట్లాడుతూ, ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పెళ్లి కాని మహిళల గురించి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుతున్నప్పటికీ, ఒత్తిడి ఒకప్పుడు ఉన్నంత తీవ్రంగా లేదని అభిప్రాయ‌ప‌డింది.

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, సంబంధాల అర్థం కూడా మారి పోయిందని స్ప‌ష్టం చేసింది. ఇవాళ ఎక్కువ మంది మ‌హిళ‌లు కెరీర్ పై దృష్టి సారిస్తున్నార‌ని, పెళ్లి అనేది సెకండ‌రీగా మారింద‌న్నారు ఫాతిమా స‌నా షేక్.

Also Read : Popular Actress Raveena Tandon : ఆ సినిమాను జీవితంలో మ‌రిచి పోలేను

Exit mobile version