ముంబై : భారత దేశ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిన మూవీ షోలే. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శనకు సిద్దమైంది మూవీ. ఈ విషయాన్ని వెరైటీ వెల్లడించింది తాజాగా. ఈ సినిమా ప్రింట్ హాల్ ఆడిటోరియంలోని భారీ హెచ్ డి స్క్రీన్‌పై హిందీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించనున్నారు. భారీ సక్సెస్ సాధించిన షోలే మూవీకిరమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. 1975లో వచ్చిన అద్భుత చిత్రం (కల్ట్ క్లాసిక్) ‘షోలే’, లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో “ఫిల్మ్స్ ఇన్ కాన్సర్ట్ష ప్రపంచ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ప్రదర్శన అక్టోబర్ 10న జరుగుతుంది. ఇందులో మెల్విన్ టే నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా, ఆర్‌డి బర్మన్ స్వరపరిచిన సంగీతాన్ని సినిమా ప్రదర్శనతో పాటు ప్రత్యక్షంగా అందిస్తుంది. సిప్పీ ఫిల్మ్స్ , ఈఎస్కే సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ ప్రదర్శనలో షోలే ది ఫైనల్ కట్ పేరుతో సినిమాను ప్రదర్శిస్తారు. ఇది రమేష్ సిప్పీ సినిమా ఇటీవల పునరుద్ధరించబడిన 4K వెర్షన్. ఇందులో 1975లో భారతీయ సెన్సార్ బోర్డ్ తొలగించిన దృశ్యాలు తిరిగి చేర్చబడ్డాయి. సిప్పీ ఫిల్మ్స్ ప్రకారం, ఈ పునరుద్ధరించబడిన వెర్షన్ థియేటర్లలో పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ వినూత్న విధానంలో ‘షోలే’ను ప్రేక్షకులకు అందించడానికి ఈఎస్కే భాగస్వామ్యం కావడం తమకు చాలా సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు సిప్పీ ఫిల్మ్స్ అధినేత షెహజాద్ సిప్పీ . రాయల్ ఆల్బర్ట్ హాల్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ మాట్ టాడ్ ఇలా అన్నారు. షోలే’ అనేది అద్భుతమైన సంగీతంతో కూడిన తిరుగులేని బాలీవుడ్ క్లాసిక్ చిత్రం. కాబట్టి, దీని ‘ఫిల్మ్స్ ఇన్ కాన్సర్ట్’ ప్రపంచ ప్రీమియర్‌ను ఇక్కడ నిర్వహించడం చాలా ఉత్సాహంగా ఉందని అన్నారు.
