హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ ద‌ళ‌ప‌తి విజ‌య్

బ‌తికినంత కాలం జీవించు స‌హ‌చ‌రుడా

hellotelugu-TrishaKrishnan

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అందాల తార త్రిష కృష్ణ‌న్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె దేశా వ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. గ‌త కొంత కాలంగా అగ్ర న‌టుడు, త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తూ వ‌స్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇందుకు సంబంధించి ఈ ఇద్ద‌రూ క‌లిసి ఎన్నో ఫంక్ష‌న్స్ కు, కార్య‌క్ర‌మాల‌కు, వివాహ వేడుకుల‌కు హాజ‌ర‌య్యారు. ఇదే క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర మాన‌సిక క్షోభ‌ను ఎదుర్కొన్నారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. త్రిష‌తో ఉన్న త‌న అనుబంధం గురించి తెలిసిన త‌న భార్య సంగీత కోర్టుకు ఎక్కారు. త‌న‌కు విడాకులు కావాల‌ని కోరారు. ఇది చ‌ర్చ‌కు దారితీసింది. ఏమైందో ఏమో కానీ ఈ ఇద్ద‌రు క‌లవ బోతున్న‌ట్లు టాక్. ఇది ప‌క్క‌న పెడితే సీఎం విజ‌య్ పుట్టిన రోజు జూన్ 22న‌.

ఈ సంద‌ర్బంగా ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బ‌ర్త్ డే సంద‌ర్బంగా ప్ర‌ధాన మంత్రి నుంచి ముఖ్య‌మంత్రులు, సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఎంద‌రో త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌ను ముఖ్యమంత్రిగా కొలువు తీరిన వెంట‌నే త్రిష కృష్ణ‌న్ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. శ్రీ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేశారు. తాజాగా త్రిష మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. విజ‌య్ తో దిగిన ఒక సహజమైన ఫోటోను త్రిష సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ వ్యక్తిగత బంధం గురించి వస్తున్న ఊహాగానాలపై త్రిష ,విజయ్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించకుండా మౌనంగానే ఉంటూ వచ్చారు. పుట్టిన రోజు సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అన్నింటినీ సార్థకం చేసే వ్యక్తికి… పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆమె రాసుకొచ్చారు.

Exit mobile version