Shreyas Iyer Shocking : గంభీర్ వ‌ల్లే అయ్య‌ర్ కు అన్యాయం

ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న అభిమానులు

Hello Telugu - Shreyas Iyer Shocking

Hello Telugu - Shreyas Iyer Shocking

Shreyas Iyer : హైద‌రాబాద్ – తాజాగా ఆసియా క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. ఈ సంద‌ర్బంగా ముంబైలోని బీసీసీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్, సెల‌క్షెన్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ హాజ‌ర‌య్యారు. అయితే అనూహ్యంగా శుభ్ మ‌న్ గిల్ ను తీసుకు వ‌చ్చారు. త‌న‌కు వైస్ కెప్టెన్సీ అప్ప‌గించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇదే స‌మ‌యంలో ఐపీఎల్ లో, గ‌తంలో ఆసియా క‌ప్ టోర్నీలో అద్భుతంగా ప్ర‌ద‌ర్శించిన క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) ను ఎంపిక చేయ‌క పోవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో అజిత్ అగార్క‌ర్ ను కాకుండా కోచ్ గౌతం గంభీర్ ను ఏకి పారేస్తున్నారు. త‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. త‌న వ‌ల్ల‌నే శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఎంపిక చేయ‌లేదంటూ మండిప‌డుతున్నారు.

Shreyas Iyer Shocking

గంభీర్ త‌న‌కు న‌చ్చితేనే ఎంపిక చేస్తాడ‌ని లేక పోతే ఎంత గొప్ప ఆట‌గాళ్ల‌యినా స‌రే ప‌క్క‌న పెడ‌తాడ‌ని ఆరోపిస్తున్నారు అభిమానులు. శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా పరుగులు చేసినప్పటికీ అతనికి మద్దతు ఇవ్వడం లేదని మాజీ క్రికెట‌ర్ సదగొప్పన్ రమేష్ ఆరోపించారు. అయ్యర్ ఆసియా కప్ ఎంపిక కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌ద‌గోప‌న్ గ‌తంలో జ‌ట్టు త‌ర‌పున ఓపెన‌ర్ గా ఆడాడు. 2025 ఐపీఎల్ లో 174 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడ‌ని, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 188 స్ట్రైక్ రేట్‌తో 300 కంటే ఎక్కువ పరుగులు చేసినా ఎందుకు జ‌ట్టులోకి తీసుకోలేదంటూ ప్ర‌శ్నించాడు ర‌మేష్.

Also Read : Botsa Satyanarayana Fired on AP Govt : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేస్తే ఊరుకోం – బొత్స‌

Exit mobile version