బాల‌య్య అఖండ‌-2 విడుద‌ల‌పై ఉత్కంఠ‌

ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని చిత్ర నిర్మాత‌లు

hellotelugu-Akhanda-2Postpone

హైద‌రాబాద్ : బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ -2 సీక్వెల్ మూవీపై ఉత్కంఠ నెల‌కొంది. విడుద‌ల తేదీ ప్ర‌కటించిన‌ప‌ప్ప‌టికీ అనుకోకుండా ప్రీమియ‌ర్ షోస్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో బాల‌య్య ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. దీనిపై న‌టుడు బాల‌కృష్ణ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే సినిమాకు సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వ‌క పోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది సినీ వ‌ర్గాల‌ను. ప్ర‌స్తుతానికి సినిమాను వాయిదా వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కానీ విడుద‌ల ఎప్పుడు చేస్తామ‌నే దానిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్వ‌ర‌లో కొత్త తేదీని క‌న్ ఫ‌ర్మ్ చేస్తామంటూ తాజాగా వెల్ల‌డించారు.

కాగా అఖండ‌-2 మూవీకి సంబంధించి కోర్టులో వివాదం చోటు చేసుకుంది. ఇంకా దీనికి సంబంధించి ప‌రిష్కారం కాలేదు. అధికారికంగా కోర్టు నుంచి ఏదో ఒక‌టి తేలితే కానీ సినిమా ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతానికి స్టే విధించారు. దానిని ఎత్తివేశాక స‌మ‌యం, సంద‌ర్బం చూసుకుని అఖండ‌-2 రిలీజ్ చేసే డేట్ ను ప్ర‌క‌టించాల‌ని నిర్మాతలు భావిస్తున్న‌ట్లు టాక్. ఇక డిస్ట్రిబ్యూట‌ర్స్ ప‌రంగా చూస్తే ఈనెల ఆఖ‌రి వారంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి పంపిణీదారుల‌తో కూడా చ‌ర్చించార‌ని , వారి సూచ‌న‌ల మేర‌కు రిలీజ్ తేదీని ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

Exit mobile version