Ex Vice President Venkaiah Naidu Inspiring : అత్య‌ద్భుతం శ్రీ‌వారి అన్న ప్రసాదం : వెంక‌య్య‌

టీటీడీ చైర్మ‌న్ తో క‌లిసి వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం

Hello Telugu - Ex Vice President Venkaiah Naidu Inspiring

Hello Telugu - Ex Vice President Venkaiah Naidu Inspiring

Venkaiah Naidu : తిరుమ‌ల – తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలోని శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నదాన స‌త్రం ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు నిత్యం ఆక‌లిని తీరుస్తోంద‌ని ఇది ఆ దేవుడు ఇచ్చిన వ‌రంగా పేర్కొన్నారు భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu). ఆదివారం ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ ఆల‌య చైర్మ‌న్ బీఆర్ నాయుడు, బోర్డు స‌భ్యుడు భాను ప్ర‌కాష్ రెడ్డితో పాటు ఏఈవో వెంక‌య్య చౌద‌రి, ఆల‌య అధికారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

Ex Vice President Venkaiah Naidu – TTD Annaprasadam

స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం వెంక‌య్య నాయుడును ఆశీర్వ‌చ‌నం చేశారు పూజారులు, ఆల‌య అర్చ‌కులు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్ర ప‌టం, ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. అక్క‌డి నుంచి నేరుగా టీటీడీ చైర్మ‌న్ తో క‌లిసి శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌దాన స‌త్రానికి విచ్చేశారు. అక్క‌డ భ‌క్తుల‌తో క‌లిసి అన్నం స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా పూర్తి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అద్బుతంగా ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆల‌య చైర్మ‌న్ బీఆర్ నాయుడును, బోర్డు స‌భ్యుల‌ను, ఆల‌య ఉన్న‌తాధికారుల‌ను అభినందించారు.

రుచికరమైన అన్నప్రసాదం పట్ల అపారమైన ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులతో ఆయన సంభాషించారు. శ్రీవారి సేవకుల సేవలను కూడా ఆయన ప్రశంసించారు. టిటిడి అందించే అన్నప్రసాదం పరిశుభ్రమైనది, రుచికరమైనదని అన్నారు. శ్రీవారి సేవకులుగా అంకితభావంతో తమ తోటి భక్తులకు సేవ చేయడానికి చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం స్వాగతించదగ్గ విష‌యం అని కొనియాడారు.

Also Read : Maha Samprokshanam Interesting : శ్రీ‌వారి ఆల‌యంలో అష్ట బంధన మహా సంప్రోక్షణ

Exit mobile version