Ex MP Vinod Fired on Minister Uttam : ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్

మాజీ ఎంపీ బోయిన్ ప‌ల్లి వినోద్ కుమార్

Hello Telugu - Ex MP Vinod Fired on Minister Uttam

Hello Telugu - Ex MP Vinod Fired on Minister Uttam

Ex MP Vinod : హైద‌రాబాద్ : రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మంగ‌ళ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. సమ్మక్క సారక్క బ్యారేజ్‌‌కు మంత్రి ఉత్తమ్ అనుమతులు సాధించినట్టు చెప్పుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఛత్తీస్ ఘడ్‌తో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమ్మక్క బ్యారేజ్‌కు కొత్తగా అనుమతులు సాధించినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని మండిప‌డ్డారు. 2001 లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు మాజీ ఎంపీ.

Ex MP Vinod Kumar Slams Minister Uttam Kumar Reddy

రూ. 811 కోట్ల రూపాయల వ్యయంతో అప్పట్లో దేవాదులకు జీవో ఇచ్చారని తెలిపారు. 2009 లో గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు . రూ. 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తీసుకు రాలేక పోయార‌ని మండిప‌డ్డారు వినోద్ కుమార్ (Ex MP Vinod). ఇన్‌టేక్ వెల్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదన్నారు. 170 రోజులు నీళ్లు తోడాల్సి ఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదన్నారు. 37 టీఎంసీల నీళ్లు కూడా కాంగ్రెస్ హయాంలో తోడ లేద‌ని ఆ విష‌యం మ‌రిచి పోయి ఉత్త‌మ్ మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. ఫుట్ వాల్ కూడా సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని చెప్పారు. దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ నిర్మించార‌ని తెలిపారు. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌ఘడ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వ లేద‌న్నారు.

Also Read : Telangana Weather Warning : తెలంగాణ‌కు వాతావ‌ర‌ణ శాఖ అల‌ర్ట్

Exit mobile version