తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఏం ప‌ని..?

తెలంగాణ త‌ల్లిపై క‌న్నేస్తే ఊరుకోమ‌న్న క‌విత

hellotelugu-KaviithaPawan

హైద‌రాబాద్ : తెలంగాణలో నవ నిర్మాణ్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ సిద్ధమవటంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు 11 రోజులు పస్తులుండి బాధపడిన వ్యక్తికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని…సినిమా యాక్టర్ గా రెండు డైలాగ్ చెప్పుకోని సభ పెట్టుకోవచ్చని అన్నారు. తెలంగాణలో నవ నిర్మాణ్ సంగతి తర్వాత ముందు ఆంధ్రా సెక్రటేరియేట్ నీళ్లు రాకుండా చూసుకోవాలని పవన్ కు సలహా ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినా, యోగా చేసిన ఒక్క ఓటు కూడా రాదన్నారు.

తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న పవన్ కళ్యాణ్ కు, తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించిన లోకేష్ కు కలిసి కవిత కౌంటర్ ఇచ్చారు. విస్తరించటానికి లోకేష్ బాబు ఇదేం మీ సామ్రాజ్యం కాదని చెప్పారు. అసలు ఆంధ్రా నాయకులు ఎప్పుడైనా తెలంగాకు మంచి జరగాలని కోరుకున్నారా అని కవిత ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు మన నీళ్లు దోచుకుందామని చూశారే తప్ప సమానంగా పంచుకుందాని ఏనాడైన అన్నారా అని కవిత నిలదీశారు. ఈ ప్రాంతం మీద ఏ మాత్రం ప్రేమ లేని వాళ్లు ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తారని చెప్పారు. తెలంగాణ తల్లి మీద కన్నేస్తామంటే ఊరుకునే ఎడ్డి తెలంగాణ ఇది కాదని కవిత స్పష్టం చేశారు.

అదే విధంగా తమకు ఆంధ్రా ప్రజలతో ఎలాంటి సమస్య లేదన్నారు. తెలంగాణను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రా రాజకీయ నాయకులతోనే అసలైన సమస్య అని అన్నారు. ఆంధ్రాలో రైతులను, ప్రజలను దోచుకున్నది చాలక తెలంగాణను కూడా దోచుకుంటారా అని నిలదీశారు. కర్ణాటకలోనో, తమిళనాడులోనో మీ పార్టీ విస్తరించుకోవాలని తెలంగాణలో మిమ్మల్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ఇక్కడి ప్రజలు మీ పార్టీలను నమ్మకపోవటంతోనే దుకాణాలు బంద్ చేసుకున్న సంగతి మర్చిపోయారా అని వారికి గుర్తు చేశారు.

Exit mobile version