Jagadish Reddy : హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమ ఓట్లతో జూబ్లీ హిల్స్ లో గెలవాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy). కేవలం నాలుగు ఇళ్లలోనే 99 బోగస్ ఓట్లు లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పార్టీ ఆధ్వర్యంలో నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. ఈ విషయం గురించి కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసిందన్నారు. తమ ఇంటి చిరునామాలను ఉపయోగించి నకిలీ ఓటర్లను నమోదు చేసుకున్నారని తెలుసుకుని నివాసితులు షాక్ అయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, బడుగుల లింగయ్య యాదవ్ నేతృత్వంలోని బృందం ఇటీవల బోరబండ డివిజన్‌ను పరిశీలించి ఆశ్చర్యకరమైన అక్రమాలను బయట పెట్టింది.
Ex Minister Jagadish Reddy Demands
బంజారా నగర్‌లోని కవిత పబ్లిక్ స్కూల్ లేన్ అనే ఒకే ఒక వీధిలో నాలుగు ఇళ్లలో 99 నకిలీ ఓట్లు ఉన్నట్లు వారు కనుగొన్నారు. తనిఖీ నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ, లేన్‌లోని దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ఒక బోగస్ ఓటరు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం, కవిత స్కూల్ లేన్‌లోని ఇంటి నంబర్ 8-4-369/338లో 42 మంది నమోదిత ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. అయితే ఇంటి యజమాని సదాశివాచారి తన కుటుంబంలో ఏడుగురు మాత్రమే అక్కడ నివసిస్తున్నారని, ఓటు హక్కులు కలిగి ఉన్నారని ధృవీకరించారు. మిగిలిన 35 ఓట్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారన్నారు. అవన్నీ ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులకు సంబంధించినవని తేలి పోయిందన్నారు. ఈ మొత్తం నకిలీ ఓట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు జగదీశ్ రెడ్డి.
Also Read : V Srinivas Goud Fired on Congress : బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామా
