Ex CM KCR Alarming : స్వాతంత్ర ఫ‌లాలు చివ‌రి గ‌డ‌ప‌కు చేరాలి : కేసీఆర్

79వ స్వాతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

Hello Telugu - Ex CM KCR Alarming

Hello Telugu - Ex CM KCR Alarming

KCR : హైద‌రాబాద్ – 79వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిపిన ఉద్య‌మంలో స్వాతంత్ర పోరాట స్పూర్తి ఇమిడి ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. స్వ‌యం పాల‌న కోసం జ‌రిగిన త్యాగాల‌ను స్వార్థ రాజ‌కీయాల కోసం దుర్వినియోగం చేయొద్ద‌ని సూచించారు. స్వాతంత్ర ఫ‌లాలు చివ‌రి గ‌డ‌ప వ‌ర‌కు చేరే దాకా పాల‌కులు కృషి చేయాల‌ని కోరారు కేసీఆర్ (KCR). శుక్ర‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎంద‌రో చేసిన త్యాగాలు, బ‌లిదానాల వ‌ల్ల దేశానికి స్వ‌తంత్రం ల‌భించింద‌ని అన్నారు.

KCR Key Comments on Independence Day

పరాయి పాలన నుండి దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులతో భరతమాత స్వయంపాలన దిశగా అడుగులేసి, నేటికి 79 ఏండ్లు గడిచినాయని పేర్కొన్నారు. త్యాగనిరతితో ఎందరో అమర వీరులు, దేశ భక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను కేసీఆర్ స్మరించుకున్నారు.

స్వాతంత్య సమరాన్ని నిరాయుధ శాంతియుత పద్ధతిలో నడిపించిన మహాత్మాగాంధీ అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర‌ పోరాట కార్యాచరణ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఇమిడివున్నదని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. జాతి ఆత్మగౌరవం కోసం స్వయంపాలన కోసం చేసిన త్యాగాలు స్వాతంత్ర అనంత‌రం భారత దేశంలో స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం కావడం బాధాకరమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, పదేండ్ల అనతికాలంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు కేసీఆర్.

Also Read : PM Narendra Modi Warning : పాకిస్తాన్ కు భారత ప్రధాని మోదీ మాస్ వార్నింగ్

Exit mobile version