అంద‌రి క‌ళ్లు డార్లింగ్ ప్ర‌భాస్ రాజా సాబ్ పైనే

దూసుకు పోతున్న ధురంధ‌ర్ మూవీ క‌లెక్ష‌న్స్

hellotelugu-RajaSaab

ముంబై : ఇండియాను షేక్ చేస్తోంది ఆదిత్య ధ‌ర్ తీసిన ధూరంధ‌ర్. ఇప్ప‌టికే విడుద‌లైన 21 రోజుల్లోనే రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఈ త‌రుణంలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి సంబంధించి ప‌లు సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శివ‌శంక‌ర ప్ర‌సాద్ మూవీ వ‌స్తోంది. దీనికి ద‌ర్శక‌త్వం వ‌హించాడు అనిల్ రావిపూడి. త‌ను తీసిన ప్ర‌తి సినిమా హిట్ గా నిలిచింది. ఈ పిక్చ‌ర్ తో పాటు మ‌రో మూవీ కూడా రానుంది రాజా సాబ్. దీనిని మారుతి తీశాడు. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా బాలీవుడ్ కు చెందిన హేమంత్ మ‌ధుక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌భాస్ మూవీ గురించి.

ప్ర‌స్తుతం ధూరంధ‌ర్ సినిమా జైత్ర‌యాత్ర‌ను అడ్డుకునే స‌త్తా ఒకే ఒక్క‌డికి ఉంద‌ని, అది కేవ‌లం పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో సంచ‌ల‌నం రేపింది. అయితే ధూరంధ‌ర్ తో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఢీకొనే స‌త్తా ఉంద‌న్నారు. హిందీ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా హార‌ర్ నేపథ్యంగా ఉండే మూవీస్ ను ఆద‌రిస్తార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కేవ‌లం ది రాజా సాబ్ కు మాత్ర‌మే ర‌ణ్ వీర్ సింగ్ ను త‌ట్టుకునే స‌త్తా ఉంద‌న్నారు. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సాధించిన విజయాల పట్ల తెలుగు సినిమా గర్వపడాలని ఆయన అన్నారు.

https://www.youtube.com/watch?v=Gp0QGBbo0CQ

Exit mobile version