స్వ‌చ్ఛాంధ్ర కోసం ప్ర‌తి ఒక్క‌రు పాటుప‌డాలి

పిలుపునిచ్చిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

Hellotelugu-APCM

శ్రీ‌కాకుళం జిల్లా : స్వ‌చ్చాంధ్ర స్వ‌ర్ణాంధ్ర కోసం ప్ర‌తి ఒక్క‌రు పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. నాలుగు వారాల పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. మున్సిపాలిటీలు కూడా స్వచ్ఛతా అవార్డులు దక్కించు కుంటాయని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంద‌న్నారు. విశాఖకు గూగుల్ కంపెనీ వస్తే రాయలసీమకు ఫైటర్ జెట్ ప్లాంట్ తీసుకు వచ్చాం అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లటం కాదు ఉత్తరాంధ్రకే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చేలా సంకల్పం తీసుకున్నాం అని చెప్పారు సీఎం పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లతో ఉత్తరాంధ్ర దశాదిశా మారుతుంద‌న్నారు.

లక్ష కోట్లతో రిలయన్స్ కూడా డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు జూలైలో ప్రారంభించ బోతున్నాం అని ప్ర‌క‌టించారు. మూలపేట పోర్టుతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. పలాసలో కూడా మరో ఎయిర్ పోర్టు కూడా నిర్మించాలని ఆలోచన చేస్తున్నాం అన్నారు. మంచి వనరులు కూడా ఉన్న జిల్లా శ్రీకాకుళం అని పేర్కొన్నారు. మనం అంతా కలిసి ఓ టీమ్ గా శ్రీకాకుళం జిల్లాలను అభివృద్ధి పథంలో నిలుపుదాం అని పిలుపునిచ్చారు. మద్దువలస స్టేజ్ 2 జనవరి 2027 ప్రారంభించ బోతున్నాం అన్నారు, హీరమండలం ఎత్తిపోతల 2027 ఏప్రిల్, వంశధార ఫేస్ 2 స్టేజ్ 2 జూలై, జంఝావతి 2027 నాటికి పూర్తి చేస్తాం అన్నారు సీఎం.

Exit mobile version