EPFO 3.0 : ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాను సులభంగా యాక్సెస్ చేయగలిగేలా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కొత్త వర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. EPFO 3.0 పేరుతో రాబోయే ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇన్ఫోసిస్, విప్రో, TCS వంటి ప్రముఖ ఐటీ సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. EPFO 2.0కు ఆధునిక రూపం ఇస్తూ, పారదర్శకంగా మరియు వేగంగా సేవలు అందించడమే దీని లక్ష్యం. ఈ ఏడాదిలోనే దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
EPFO 3.0 – ATM ద్వారా నేరుగా PF విత్‌డ్రా
EPFO 3.0తో ఉద్యోగులు తమ PF మొత్తాన్ని ATMల ద్వారా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) యాక్టివేట్ చేసి, ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోవాలి. ఈ సౌకర్యం అత్యవసర సమయాల్లో పెద్ద సహాయకారిగా నిలుస్తుంది.
UPI ద్వారా సౌకర్యం
డిజిటల్ లావాదేవీల విస్తరణలో భాగంగా, UPI పేమెంట్ గేట్‌వే ద్వారా కూడా PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది. Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లతో నేరుగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే పేరు, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల మార్పులు వంటి పనులు ఇకపై EPFO కార్యాలయానికి వెళ్లకుండా, ఆన్లైన్లోనే OTP వెరిఫికేషన్ ద్వారా చేయవచ్చు.
మరణానంతర క్లెయిమ్స్ సులభతరం
ఉద్యోగి మృతి చెందిన సందర్భంలో కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవడం మరింత సులభం కానుంది. మైనర్ల విషయంలో గార్డియన్‌షిప్ సర్టిఫికెట్ అవసరం లేకుండా, ప్రాథమిక డాక్యుమెంట్లు సమర్పిస్తే చాలు. దీంతో క్లెయిమ్ ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది.
మొబైల్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్
EPFO 3.0లో మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్‌తో కొత్త ఇంటర్‌ఫేస్ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులు ఎప్పుడైనా తమ PF కాంట్రిబ్యూషన్లు, క్లెయిమ్ స్థితి, బ్యాలెన్స్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు.
Also Read : India Govt New Rules Sensational : ఆర్థిక లావాదేవీలపై భారత్ సర్కార్ విదించనున్న కొత్త నియమాలు ఇవే
