India Govt New Rules Sensational : ఆర్థిక లావాదేవీలపై భారత్ సర్కార్ విదించనున్న కొత్త నియమాలు ఇవే

వీటి ప్రభావం నేరుగా సామాన్య ప్రజల జీవితంపై పడనుంది.

Hello Telugu - India Govt New Rules Sensational

Hello Telugu - India Govt New Rules Sensational

India Govt : ప్రతి నెల మొదటి తేదీతోపాటు ఆర్థిక రంగంలో కొన్ని మార్పులు అమలవుతుంటాయి. ఈసారి కూడా సెప్టెంబర్ 1, 2025 నుంచి పన్నులు, బ్యాంకింగ్, గ్యాస్ ధరలు, విలువైన లోహాలు వంటి విభాగాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటి ప్రభావం నేరుగా సామాన్య ప్రజల జీవితంపై పడనుంది. ప్రధాన మార్పులు ఇవి:

India Govt – GST స్లాబ్ మార్పులు

సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీ లో జరగనున్న 56వ GST కౌన్సిల్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత 5%, 12%, 18%, 28% నాలుగు స్లాబ్‌ల బదులుగా, కేవలం 5% మరియు 12% రెండు స్లాబ్‌లు మాత్రమే అమలులోకి వచ్చే అవకాశముంది. దీంతో రోజువారీ అవసరాలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

India Govt – వెండి ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి?

ఇప్పటివరకు బంగారంపైనే అమల్లో ఉన్న హాల్‌మార్కింగ్ విధానం, వెండి ఆభరణాలపై కూడా సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరి కావచ్చు. దీని వల్ల ధరలపై స్వల్ప ప్రభావం ఉన్నా, నాణ్యత, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

LPG ధరల సవరణ

ప్రతి నెలా లాగే, ఈసారి కూడా సెప్టెంబర్ 1న గృహ మరియు వాణిజ్య ఉపయోగ LPG సిలిండర్ల ధరలు సవరణకు గురికానున్నాయి. పెరుగుదల జరిగితే వంటగది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

SBI క్రెడిట్ కార్డుల కొత్త నియమాలు

SBI లైఫ్స్‌స్టైల్ హోమ్ సెంటర్ క్రెడిట్ కార్డ్ మరియు దాని సెలెక్ట్ వెర్షన్ వినియోగదారులకు కొత్త మార్పులు వర్తిస్తాయి. డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ పోర్టల్ చెల్లింపులపై ఇకపై రివార్డ్ పాయింట్లు లభించవు. అదనంగా, ఆటో డెబిట్ విఫలమైతే అంతర్జాతీయ లావాదేవీలపై 2% జరిమానా విధించబడుతుంది. కొన్ని లావాదేవీలపై అదనపు ఛార్జీలు వర్తించే అవకాశమూ ఉంది.

జన్ ధన్ ఖాతాదారులకు KYC తప్పనిసరి

ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాల వినియోగదారులు సెప్టెంబర్ 30 లోపు KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. RBI ఇప్పటికే దీనిని స్పష్టం చేసింది. బ్యాంకులు గ్రామ, పంచాయతీ స్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేసి, అవసరమైన డేటా అప్డేట్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

ఆదాయపు పన్ను రిటర్న్ చివరి తేదీ

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15, 2025 చివరి గడువుగా నిర్ణయించబడింది.

Also Read : Online Gaming Challenge : కేంద్ర సర్కార్ నిర్ణయంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన గేమింగ్ సంస్థలు

Exit mobile version