డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలి : నారా లోకేష్‌

మోడ‌ల్ ప్రైమ‌రీ స్కూల్స్ పై దృష్టి సారించాలి

hellotelugu-NaraLokesh

అమ‌రావ‌తి : చిత్తూరు జిల్లాలో బాల్య వివాహాల పట్ల మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో జీఎఫ్ఎల్ఎన్ పై దృష్టి సారించాలని ఆదేశించారు. స్టూడెంట్స్ ఫెర్ఫార్మెన్స్ కూడా తక్కువగా ఉందని, ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ లో కూడా చిత్తూరు వెనుకబడి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చిత్తూరు డీఈవో కే.రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. చిత్తూరుకు తమిళనాడు, బెంగళూరు దగ్గరగా ఉండటంతో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పలుచోట్ల బాల్య వివాహాలు కూడా జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. లీప్ యాప్ డౌన్ లోడ్స్ పై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ఆ జిల్లాకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి లోకేష్ చెప్పారు. హైస్కూల్స్ లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విద్యార్థుల చేరిక తక్కువగా ఉందని, దీనిపైనా దృష్టి పెట్టాలన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై స్పందిస్తూ.. అక్కడి విద్యార్థుల్లో కసి ఉందని, వారికి దిశా నిర్దేశం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. డీఈవో కే.రామకృష్ణారావు స్పందిస్తూ.. జిల్లాలో 3,242 మంది డ్రాపౌట్స్ ఉన్నారని తెలిపారు. స్టూడెంట్స్ యావరేజ్ అటెండెన్స్ 79.30 శాతం ఉందని, టీచర్ల సరాసరి హాజరు 78.40 శాతంగా ఉందని వివరించారు.

Exit mobile version