Employment Growth : 2వ కోర్టర్ లో భారీగా కొలువుల జాతర

కొత్తగా ఉద్యోగులను నియమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడయింది...

Hello Telugu - Employment Growth

Hello Telugu - Employment Growth

Employment : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ద్వితీయార్ధంలో దేశీయ ఉపాధి మార్కెట్‌ గణనీయంగా అభివృద్ధి చెందనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్‌ నౌకరీ నిర్వహించిన తాజా ద్వైవార్షిక సర్వే ప్రకారం, వివిధ రంగాలకు చెందిన యాజమాన్య సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడయింది.

ఈ సర్వేలో పాల్గొన్న 1,300 మంది యాజమాన్య ప్రతినిధులలో 72 శాతం మంది నికరంగా అదనపు సిబ్బందిని నియమించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు. అలాగే, 94 శాతం మంది యాజమాన్యాలు ద్వితీయార్ధంలో కొంతమందిని ఉద్యోగాల్లో (Employment) చేర్చుకునే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు.

Employment – కృత్రిమ మేధ (AI) ప్రభావంపై స్పష్టత

ఉపాధిపై కృత్రిమ మేధ (AI) ప్రభావం పెరుగుతుందన్న చర్చల నడుమ, ఈ సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. 87 శాతం యాజమాన్య ప్రతినిధులు, ఉద్యోగ నష్టాల పరంగా ఏఐ ప్రభావం తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడగా, 13 శాతం మంది మాత్రం ఏఐ ఉపాధి అవకాశాలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

AI ప్రభావం అధికంగా ఉండే రంగాలు:

ఆధునిక టెక్నాలజీలపై ఎక్కువ డిమాండ్‌

సర్వేలో స్పెషలైజ్డ్ టెక్నాలజీలపై ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా గుర్తించారు. 37 శాతం యాజమాన్యాలు ఐటీ రంగంలో కొత్త ఉద్యోగులను నియమించాలనుకుంటున్నట్టు తెలిపాయి. ముఖ్యంగా, సాంప్రదాయ టెక్నాలజీల కంటే మెషిన్ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, ఏఐ ఆధారిత టెక్నాలజీలకు ప్రాధాన్యత పెరుగుతున్నదని నివేదిక పేర్కొంది.

అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు

ఉపాధి అవకాశాల్లో అనుభవం కీలకపాత్ర పోషిస్తోందని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది.

నౌకరీ వ్యాఖ్య

ఈ సర్వే ఫలితాలపై స్పందించిన నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్, “నికర సిబ్బంది విస్తరణపై 72 శాతం యాజమాన్యాల నిర్ణయం ఉపాధి రంగానికి బలాన్నిస్తుంది. తాజా టెక్నాలజీల్లో నైపుణ్యాలు కలిగి ఉండే అభ్యర్థులకు మంచి అవకాశాలు ఉండబోతున్నాయి” అని తెలిపారు.

Also Read : India Economy Growth : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఎస్బిఐ కీలక నివేదిక

Exit mobile version