India : భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేయనుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా అధ్యయనం సూచిస్తోంది. జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని ఎస్బీఐ అంచనా వేసింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించనున్నదిగా పేర్కొంది.
India – వృద్ధిలో ఊపందుకుంటున్న భారత ఆర్థికత
ఎస్బీఐ రూపొందించిన ‘నౌకాస్ట్ మోడల్’ ప్రకారం, ఈ త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 6.9 శాతానికి, స్థూల విలువ ఆధారిత వృద్ధి (జీవిఏ) 6.5 శాతానికి చేరుతుందని తెలిపింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తున్నదని సూచిస్తోంది.
అయితే, మొత్తం ఆర్థిక సంవత్సరం (FY26) దృష్ట్యా వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. ఇది ఆర్బీఐ లక్ష్యమైన 6.5 శాతంతో పోలిస్తే తక్కువ. ముఖ్యంగా రెండో త్రైమాసికం నుంచి నాలుగో త్రైమాసికం వరకు వృద్ధి అంచనాలను సరిచూసి, తక్కువగా 0.2 శాతం పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది.
India – వాస్తవ జీడీపీ, నామమాత్ర జీడీపీ మధ్య అంతరం తగ్గుముఖం
ఎస్బీఐ నివేదికలో మరో ఆసక్తికర అంశంగా, వాస్తవ (రియల్) జీడీపీ మరియు నామమాత్ర (నామినల్) జీడీపీ వృద్ధి మధ్య తేడా గణనీయంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది 12 శాతం పాయింట్లు ఉండగా, 2025 నాటికి 3.4 శాతానికి పడిపోయిందని వెల్లడించింది.
తక్కువ ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) కారణంగా ఈ తేడా 2026 మొదటి త్రైమాసికంలో మరింత తగ్గే అవకాశముందని నివేదికలో తెలిపింది. ఈ పరిణామం వృద్ధి తీరులో కొంత మందగమనం వచ్చిందని సూచించవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది.
వ్యవస్థకు ధృడత కలిగించే అంచనాలు
నివేదిక ప్రకారం, వాస్తవ జీడీపీ వృద్ధి పటిష్టంగానే ఉన్నా, నామమాత్ర వృద్ధి 8 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే, తొలి త్రైమాసికంలో నమోదయ్యే బలమైన వృద్ధి రేటు భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన ధృడతను సూచిస్తున్నదిగా పేర్కొంది.
Also Read : Stock Market Decline Sensational : దేశీయ స్టాక్ మార్కెట్ లో 6 రోజుల ర్యాలీకి బ్రేక్
