Election Commission : భారత దేశ ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధంఖర్ అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఉప రాష్ట్రపతి పదవి నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది ఈసీ (Election Commission). ఇదిలా ఉండగా జూలై 21న సోమవారం ఎవరూ ఊహించని రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.
Election Commission Announced
తను గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్వా స సంబంధమైన వ్యాధితో. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లారు. అనారోగ్య కారణాల రీత్యా తాను ఎక్కువ కాలం పని చేయలేనంటూ పేర్కొన్నారు రాజీనామా పత్రంలో. ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా సమావేశాలు నిర్వహించేందుకు వీలు కలుగుతుందన్నారు. కాగా ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారు ఎవరైనా తమ పదవుల నుంచి తప్పుకున్నట్లయితే వెంటనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. మంగళవారం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సజావుగా, సకాలంలో ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలతో సమన్వయంతో సహా అవసరమైన అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ పదవికి సంభావ్య అభ్యర్థులకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇప్పటికే అంతర్గత చర్చలను ప్రారంభించాయి.
Also Read : AP Govt – Free Housing Sites : ఉచిత ఇంటి స్థలాలకు మార్గదర్శకాలు జారీ
