AP Govt – Free Housing Sites : ఉచిత ఇంటి స్థ‌లాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ

Hello Telugu - AP Govt - Free Housing Sites

Hello Telugu - AP Govt - Free Housing Sites

AP Govt : అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నిరుపేద‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. జీవో నం. 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాలు పొందేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇంటి స్థ‌లాల‌ను ముఖ్యంగా
రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్ల భూమి ఇవ్వ బడుతుంద‌ని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమి కేటాయిస్తారు. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కి (AP Govt) చెందినవారై ఉండాలని స్ప‌ష్టం చేశారు.

AP Govt Key Announcement on Free Housing Sites

కుటుంబంలో ఎవరికి అయినా ఇంటి స్థలం లేక పోతేనే ఇంటి స్థ‌లం కేటాయించ‌డం జ‌రుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అర్హులు కారని పేర్కొన్నారు సీఎస్. ఇప్పటికే భూమి ఉన్నవారికి కేటాయింపు ఉండదు (గ్రామీణ – 5 సెంట్లు, పట్టణం – 2.5 సెంట్లు). చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు సీఎస్. ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్లీ అర్హులు కార‌ని స్ప‌ష్టం చేశారు మైనర్ వయస్సులో ఉన్న వారికి స్థలం ఇవ్వబడదు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంద‌ని పేర్కొన్నారు.

స్థలం లేని చోట APTIDCO లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇంటి స్థలాన్ని వేరేవారికి అమ్మడం, ఇవ్వడం నిషేధం. స్థలాల లేఅవుట్ సర్వే, అప్రమత్తంగా చేయాలి. ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పత్రం (పట్టా) ఇవ్వబడుతుంది.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలి.

గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలి. ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలి. అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలి. ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చు. కుటుంబ ఆదాయం రూ.10,000 (గ్రామీణ), రూ. 12,000 (పట్టణ) లోపల ఉండాలి. అర్హత కలిగిన మహిళల పేర మీద స్థలం కేటాయింపు ఉంటుంది. స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన ఉంటుంది. ఓపెన్ ప్లాట్లు, అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలుంటుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని స్ప‌ష్టం చేశారు సీఎస్.

Also Read : Supreme Court Shocking Comments : ఓటరు గుర్తింపు, రేషన్ కార్డు పౌరసత్వానికి రుజువు కాదు

Exit mobile version