Grapes : ఆరోగ్యానికి అనేక లాభాలు కలిగించే పండుగా పేరుగాంచిన ద్రాక్షను పరిమితికి మించి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి మధుమేహం, మూత్రపిండాల సమస్యలున్నవారు, గర్భిణీ స్త్రీలు ద్రాక్షను నియమితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
Grapes – బరువు పెరుగుదల
ద్రాక్షలో (Grapes) సహజంగా ఎక్కువ మోతాదులో చక్కెరలు, అధిక కేలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే ఇది శరీర బరువు పెరగడానికి దారితీస్తుంది. క్రమంగా ఇది ఊబకాయంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బరువు నియంత్రణలో ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే ద్రాక్షను తీసుకోవాలి.
జీర్ణక్రియ సమస్యలు
ద్రాక్షను అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, ముఖ్యంగా విరేచనాలు కలగవచ్చు. తియ్యదనంతో కూడిన ఈ పండు అధికంగా తీసుకోవడం కడుపుబ్బరానికి దారితీస్తుంది. అంతేకాకుండా పేగు మార్గంలో అసమతుల్యత కలిగించే అవకాశం ఉంది.
కిడ్నీ సంబంధిత ఇబ్బందులు
మధుమేహం మరియు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నవారు ద్రాక్షను అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా చూస్తే మూత్రపిండాల పనితీరు దెబ్బతిని, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ముప్పు పెరిగే ప్రమాదం ఉంది.
అలెర్జీ ప్రమాదం
ద్రాక్షలో (Grapes) ఉండే కొన్ని ప్రొటీన్ సమ్మేళనాలు కొందరికి అలెర్జీ ప్రతిచర్యలను కలిగించవచ్చు. వీటిలో చర్మంపై దద్దుర్లు, వాపు, మొటిమలు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ అనే ప్రాణాంతక అలెర్జీ ప్రతిస్పందన కూడా కలగవచ్చు.
గర్భధారణలో జాగ్రత్త
గర్భిణీ స్త్రీలు ద్రాక్షను అధికంగా తీసుకోవడం వల్ల గర్భంలో పెరుగుతున్న శిశువులో ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలు కలగవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. అదేవిధంగా గర్భధారణ సమయంలో మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) వచ్చే ప్రమాదాన్ని కూడా ఇది పెంచవచ్చు. కాబట్టి గర్భిణీలు డైట్‌లో భాగంగా ద్రాక్షను మితంగా మాత్రమే చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు.
ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని పరిమితంగా, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా సందేహాలు ఉన్నపక్షంలో వైద్యుల సలహా తీసుకోవాలి.
Also Read : Java Plum Seeds Powder Proven : షుగర్ ను కంట్రోల్ చేసే అత్యంత అద్భుతమైన ఔషధం ఇదే
