MP Eatala Rajender Shocking Comments : బండి సంజయ్ పై ఈట‌ల మాటల తూటాలు

వీరులతో కొట్లాడుతం కుట్ర‌దారుల‌తో కాదు

Hello Telugu - Eatala Rajender Shocking Comments

Hello Telugu - Eatala Rajender Shocking Comments

Eatala Rajender : క‌రీంన‌గ‌ర్ జిల్లా – మ‌ల్కాజ్ గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Eatala Rajender) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న నేరుగా కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ ని టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. ఆను వీరులతో ధీరులతో కోట్లాడతాన‌ని, కుట్రదారులతో ద్రోహులతో కాదని ప్ర‌క‌టించారు. శ‌నివారం త‌న నివాసానికి వ‌చ్చిన అభిమానుల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు. కొడకా ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

MP Eatala Rajender Shocking Comments

బండి సంజయ్ పై మాటల తూటాలు పేల్చారు ఈట‌ల రాజేంద‌ర్. వాడు సైకోనా శాడిస్టా మనిషా లేక‌ పశువా అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో వెనుక ఉన్న‌ది ఎవ‌డో త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్నాడు. అబ‌ద్దాల పునాదుల మీద బ‌తికే వారు ఉంటార‌ని, వాళ్ల‌ను చూసి జ‌డుసు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మ‌న‌ది నేరుగా పోరాడుతాం త‌ప్పా స్ట్రీట్ ఫైట్ కాద‌న్నారు.

వెనుక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడే సంస్కృతి త‌న‌ది కాద‌న్నారు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు అని, మ‌నం ముఖ్యం కాద‌న్నారు. కాలం అన్నింటిని గ‌మ‌నిస్తుంద‌ని ఏదో ఒక రోజు గుణ‌పాఠం ఇచ్చి తీరుతుంద‌న్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని నాకు తెలియ‌ని ప్రాంతం, మ‌నుషులంటూ ఎవ‌రూ లేర‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. హుజూరాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో మనమే ఉంటాం, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా అన్నింట్లో మ‌న‌మే ఉండి తీరుతామ‌న్నారు. వాడెవ‌డు చెప్ప‌డానికి న‌న్ను హెచ్చ‌రించడానికి అంత ధైర్యం ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు.

Also Read : Donald Trump Warning : బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాస్ వార్నింగ్

Exit mobile version