MP Eatala Rajender Shocking Comments : కుల‌, మ‌తాల మీద రాజ‌కీయాలు న‌డ‌వ‌వు

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఈట‌ల రాజేంద‌ర్

Hello Telugu - MP Eatala Rajender Shocking Comments

Hello Telugu - MP Eatala Rajender Shocking Comments

Eatala Rajender : హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ (Eatala Rajender) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడి పోవ‌డం, డిపాజిట్ రాక పోవ‌డంపై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. రాబోయే భ‌విష్య‌త్తు బీజేపీదేన‌ని ప్ర‌క‌టించారు. పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ నిరాశ చెంద‌వ‌ద్ద‌ని కోరారు. ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజం అన్నారు . తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమ‌ని పేర్కొన్నారు. కులం మతం పునాదిమీద రాజకీయాలు శాశ్వతంగా నడవవ‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్. గెలిచిన ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని స్ప‌ష్టం చేశారు. వేలాది మంది బీజేపీ కారకర్తలు, వందల మంది నాయకుల భవిష్యత్తు కోసం తాను భ‌రోసా ఇస్తున్నాన‌ని తెలిపారు.

MP Eatala Rajender Shocking Comments

సీఎం, మంత్రులు. కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్నా.. ఒకటి అర్ధం చేసుకోవాలి.. నారాయణఖేడ్, పాలేరు లో, హుజూర్ న‌గ‌ర్ లో, నాగార్జున సాగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అన్నిటిలో అధికార పార్టీ గెలిచిందన్న విస‌యం గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. ఆనాడు కేసీఆర్ ఆ అహంకారం అణచడానికి దుబ్బాకలో బీజేపీని గెలిపించార‌ని చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్ . అన్యాయానికి న్యాయానికి.. ఆత్మగౌరవానికి అహంకారానికి.. ధర్మానికి అధర్మానికి జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిచిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆ ఎన్నిక కోసం ఎదురు చూశార‌ని చెప్పారు. స్వయంగా కేసీఆర్ వచ్చి దళిత బంధు ప్రకటించినా గెలవలేక పోయారని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

Also Read : Ramachandra Yadav Strong Demand : అమ‌రావ‌తిలో బిసి కులాలకు భూములు కేటాయించాలి

Exit mobile version