Ramachandra Yadav : అమరావతి : బీసీఐ పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో అన్ని బీసీ కులాలకు భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్లు అవుతున్నా రాజధానిపై ఇంత వరకు గెజిట్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు మాయాజాలం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాజధానిలో బిసిలకు వాటా కోసం రాష్ట్ర స్థాయి పోరాటానికి సిద్ధం అవుతున్నామని ప్రకటించారు. త్వరలోనే బిసి సంఘాలు, బిసి పెద్దలతో చర్చా వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. మంగళగిరిలో జరిగిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు . బిసిల్లోని అన్ని సామాజిక వర్గాలకు భూములు కేటాయించి ఆత్మగౌరవ భవానాలను నిర్మించి ఇవ్వాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ కోరారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై, ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిపై తన గళాన్ని బలంగా వినిపించారు.
BCY Party Chief Ramachandra Yadav Comments
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా ఇప్పటి వరకు రాజధానికి ఒక చట్టబద్ధమైన గెజిట్ నోటిఫికేషన్ తీసుకు రాకపోవడం గత, ప్రస్తుత పాలకుల చేతకానితనానికి నిలువుటద్దం అని అన్నారు. రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా, పెట్టుబడుల పేరుతో మాయాజాలం సృష్టిస్తూ, ప్రజల భవిష్యత్తుతో, ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముక అయిన బీసీల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అడుగడుగునా అన్యాయానికి, అవమానానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత చైతన్య యువజన పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది. రాజధాని అమరావతిలో, పెత్తందార్లకు కాకుండా, ఈ రాష్ట్రానికి పునాది అయిన బీసీలలోని ప్రతి సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని కోరారు.
Also Read : Rajasthan Royals Important Update : రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా సంగక్కర
