DY CM Bhatti Vikramarka Important Update : హైద‌రాబాద్ లో వ‌ర‌ల్డ్ క్లాస్ ఫిలిం సిటీ

ప్ర‌క‌టించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Update

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Update

Bhatti Vikramarka : హైద‌రాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాద్ లో వ‌ర‌ల్డ్ క్లాస్ ఫిలిం సిటీని నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజుతో పాటు ప‌లువురు సినీ రంగానికి చెందిన నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం తెలుగు క్లబ్‌లో సినీ ప్రముఖులు, సినీ కార్మిక నాయకులతో సమావేశం నిర్వహించారు. స‌మావేశంలో కీల‌క ప్ర‌సంగం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సినీ రంగానికి ప్ర‌యారిటీ ఇస్తున్నామ‌న్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున రాయితీలు కూడా క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు డిప్యూటీ సీఎం.

DY CM Bhatti Vikramarka Keyt Update

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు.
సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని చెప్పారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌.
చెన్నై నుంచి సినీ రంగాన్ని హైదరాబాద్‌కు రప్పించి, స్టూడియోలకు భూములు ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసింది కూడా త‌మ స‌ర్కారేన‌ని మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు. ఫిలిం క్లబ్, చిత్రపురి కాలనీ ఏర్పాటు ఇలా ఎన్నో సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లో అన్ని భాషల వారు కలసి ఎదుగుతున్నారని అన్నారు. భవిష్యత్తులో చిన్న, పెద్ద సినిమాలు ఎక్కువగా రావాలని కోరారు. సినీ రంగం ఎదిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

Also Read : Minister Kandula Durgesh Important Update : ఏపీ పునర్నిర్మాణం కోసం ప్ర‌య‌త్నం

Exit mobile version