Kandula Durgesh : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). లండన్ పర్యటనలో భాగంగా లండన్ లోని జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడేలా ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ సోదర సోదరీమణులు చూపిన నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అని కొనియాడారు కందుల దుర్గేష్. తమ బిజీ షెడ్యూల్ మధ్య కూడా మాతృభూమి అభివృద్ధి కోసం వారు చేసిన కృషి, నిస్వార్థ సేవ మరువలేనిదని అన్నారు.
Minister Kandula Durgesh Comments
2019–2024 మధ్య విధ్వంసక, నియంతృత్వ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన వారందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ–జనసేన–బీజేపీ సఖ్యతతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హృదయ పూర్వక వందనాలు ప్రజాముఖంగా తెలియ చేస్తున్నానని అన్నారు కందుల దుర్గేష్.
జనసేనాని ఆశీస్సులు, మీ అందరి ప్రేమాభిమానాలతోనే తాను మంత్రిని అయ్యానని చెప్పారు. అపార పరిపాలనా అనుభవం గల ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధి, ముఖ్యంగా పర్యాటక రంగ పురోగతి కోసం మరింత కృషి చేస్తూ ముందుకు సాగుతానని ప్రకటించారు. లండన్‌లో తనను ఆత్మీయంగా ఆహ్వానించిన ఎన్ఆర్ఐలకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Palla Srinivasa Rao Warning : పార్టీ గీత దాటితే వేటు తప్పదు : శ్రీనివాసరావు
