బెంగళూరు : కేజీఎఫ్, సలార్ మూవీస్ తో భారతీయ సినిమా రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శాండిల్ వుడ్ కు చెందిన ప్రశాంత్ నీల్. తను తాజాగా డైనమిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ పేరుతో మూవీ తీస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఎన్టీఆర్-నీల్ ల ‘డ్రాగన్’ రెండు భాగాలుగా విడుదల కానుంది. అయితే సెకండ్ పార్ట్ 2027లో రానున్నట్లు టాక్. ‘డ్రాగన్’ మొదటి భాగం 2027 జూన్‌లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. రెండో భాగం 2027 డిసెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ రెండు భాగాల విడుదల ప్రణాళిక గురించి లేదా రెండో భాగం విడుదల తేదీ గురించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ దేశభక్తి ప్రధాన యాక్షన్ డ్రామాలో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల , అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల ప్రణాళికలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా డ్రాగన్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టులను త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడిలతో చేయనున్నారు.
