చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు సూర్య. ఆయన అందరి లాంటి నటుడు కాదు. చాలా పకడ్బందీగా కథలను ఎంచుకుంటారు. ఈ ఏడాది ఆయన నటించిన మూవీస్ అన్నీ వెరీ స్పెషల్. ప్రతి మూవీ దుమ్ము రేపుతూ కాసుల వర్షం కురిపించేలా చేసింది. ఎక్కువగా ప్రచారం చేయకుండానే చాలా సింపుల్ గా, ఎలాంటి హడావుడి లేకుండానే సినిమాలను రిలీజ్ చేయడం, అందరినీ విస్తు పోయేలా చేయడం తనకు అలవాటిగా మారింది సూర్యకు. తాజాగా తనతో పాటు నజియా నజ్రీమ్ తో కలిసి నటించిన చిత్రం సీన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత కాసుల పంట పండించేలా చేస్తోంది. కేవలం విడుదలైన 10 రోజుల్లోనే బాక్సులు నింపేలా చేసింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం.
చిత్ర బృందం సోషల్ మీడియాలో తాజా కలెక్షన్ వివరాలను పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ‘కరుప్పు’ , ‘విశ్వనాథ్ అండ్ సన్స్స చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న ఆయన, తాజాగా ‘సీన్’ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. చిత్ర బృందం సోషల్ మీడియాలో ఈ కలెక్షన్ వివరాలను వెల్లడించగా, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం. ప్రపంచ వ్యాప్తంగా ₹260 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది అని పేర్కొన్నారు. ‘సీన్’ చిత్రంలో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ అనే పాత్రలో కనిపించారు. వందలాది మంది నేరస్థులను పట్టుకోవడంలో పేరుగాంచిన, విలక్షణమైన , కఠినమైన పోలీస్ అధికారిగా నటించారు. కోవిడ్-19 సమయంలో జరిగిన ఒక హత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు నజ్రియా నజీమ్, నాస్లెన్, ఆనందరాజ్, లాల్ , రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని 2D ఎంటర్‌టైన్‌మెంట్, జహగరం స్టూడియోస్ బ్యానర్లపై సూర్య , జయశ్రీ దామోదరన్ సంయుక్తంగా నిర్మించారు.
