Dussehra Huge Arrangements : ద‌స‌రా సంబురాల‌కు స‌ర్వం సిద్ధం

జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ

Hello Telugu - Dussehra Huge Arrangements

Hello Telugu - Dussehra Huge Arrangements

Dussehra : ఎన్టీఆర్ జిల్లా : ఇంద్ర‌కీలాద్రి క‌న‌క‌దుర్గ‌మ్మ సంబురాల‌కు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశామ‌న్నారు జిల్లా క‌లెక‌ట్ర్ డాక్టర్ జి. ల‌క్ష్మీశ‌. ద‌స‌రా ఉత్స‌వాల‌కు క‌నీసం 20 ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నామ‌న్నారు. శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు జ‌రిగే ద‌స‌రా (Dussehra) మ‌హోత్స‌వాల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ద‌స‌రా (Dussehra) మ‌హోత్స‌వాలు -2025పై శ‌నివారం క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం మ‌హా మండ‌పం ఆరో అంత‌స్తులో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, ఈవో వీకే శీనానాయ‌క్‌.. ఆల‌య పండితులు, అధికారుల‌తో క‌లిసి మీడియా స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు.

Vijayawada Dussehra Updates

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఎంత మంది భ‌క్తులు వ‌చ్చినా ఎక్క‌డా లోటుపాట్లు లేకుండా ఈసారి ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని కూడా ఉప‌యోగించుకుంటూ సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ వినూత్న విధానాల‌తో ముందుకెళ్తున్న‌ట్లు తెలిపారు. సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో అమ్మ వారి ద‌ర్శ‌నం మ‌ధురానుభూతిని క‌లిగించేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. సామాన్య భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకొని రూ. 500 టికెట్‌ను ర‌ద్దు చేశామ‌ని తెలిపారు. అదేవిధంగా ర‌ద్దీ ఎక్కువ‌గా లేని ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య వీఐపీ దర్శనాలు ఉంటాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు.

వినాయ‌క గుడి నుంచి.. టోల్ గేట్ ద్వారా కొండ‌పైకి వెళ్లి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకునేందుకు ఏర్పాటుచేసిన క్యూలైన్ల‌తోపాటు ఇత‌ర క్యూలైన్ల‌లో ప్ర‌తి 100 మీట‌ర్ల‌కు క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ తెలిపేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ప్ర‌తి 50 మీట‌ర్ల‌కు ఒక అత్య‌వ‌స‌ర ద్వారాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. 90 శాతానికి పైగా సంతృప్తి స్థాయి న‌మోద‌య్యేలా క్యూలైన్ల‌లో వేచి ఉండే స‌మ‌యాన్ని బాగా త‌గ్గించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. మోడ‌ల్ గెస్ట్‌హౌస్‌లోని క‌మాండ్ కంట్రోల్ కేంద్రానికి 500 సీసీటీవీల‌ను అనుసంధానించిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

Also Read : Assam Clear Instructions – CID : అస్సాం గాయ‌కుడి మృతిపై సీఐడీ విచార‌ణ

Exit mobile version