Assam : అస్సాం : భారత దేశం గర్వించ దగిన అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) అనుమానస్పద స్థితిలో సింగపూర్ లో మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన తన మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సీఎం హిమంత బిస్వా శర్మ. జుబీన్ గార్గ్ మృతి కేసులో బహుళ ఎఫ్ఐఆర్‌ల తర్వాత అస్సాం ముఖ్యమంత్రి సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు . గౌహతిలోని జుబీన్ గార్గ్ ఇంటికి వందలాది మంది అభిమానులు గుమి గూడారు, దిగ్గజ గాయకుడి పట్ల అపారమైన ప్రేమను ప్రదర్శించారు.
Assam CM Comments
ముఖ్యమంత్రి శర్మ మాట్లాడుతూ సింగపూర్‌లోని హైకమిషనర్ జుబీన్‌తో పాటు ఉన్న వ్యక్తుల జాబితాను నాకు పంపారని తెలిపారు. అందులో సింగపూర్‌లో నివసిస్తున్న అస్సామీ సమాజానికి చెందిన అభిమన్యు తాలూక్‌దార్ అనే వ్యక్తితో సహా 11 మంది ఉన్నారని, గాయకుడి బృందంలోని నలుగురు సభ్యులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ దురదృష్టకర, అకాల మరణానికి సంబంధించి శ్యామ్‌కాను మహంత, సిద్ధార్థ్ శర్మపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయని చెప్పారు. అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సిఐడికి బదిలీ చేయాలని, సమగ్ర దర్యాప్తు కోసం ఏకీకృత కేసును నమోదు చేయాలని తాను డీజీపీని ఆదేశించానని చెప్పారు.
జుబీన్ గార్గ్ భాషా, సాంస్కృతిక సరిహద్దులను అధిగమించిన గాయకుడు. గార్గ్ అస్సాంలో ఇంటి పేరు మాత్రమే కాదు, భారతీయ సంగీతం, సినిమాల్లో కూడా ప్రభావవంతమైన వ్యక్తి. అతని ఆకస్మిక మరణం ఈ ప్రాంతం, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలలో శూన్యతను మిగిల్చిందని పేర్కొన్నారు సీఎం.
Also Read : Rahul Gandhi Fired on EC : ఈసీ నిర్వాకంపై రాహుల్ గాంధీ ఫైర్
