దూసుకు పోతున్న దురంధ‌ర్ -2 మూవీ

పాజిటివ్ టాక్ తో క‌లెక్ష‌న్ల సునామీ

hellotelugu-Durandhar-2Sensation

ముంబై : బాలీవుడ్ కు చెందిన ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ ఇప్ప‌టికే సంచ‌ల‌నం రేపింది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. పాకిస్తాన్ లో ఇండియ‌న్ సీక్రెట్ ఏజెంట్ ఏం చేశాడ‌నే దానిపై ఆ మూవీని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉండ‌గా తాజాగా దురంధ‌ర్ మూవీ భారీ స‌క్సెస్ సాధించ‌డంతో ఆదిత్య ధ‌ర్ మ‌రో సాహ‌సానికి శ్రీ‌కారం చుట్టాడు. క‌థ మీద ప‌ట్టు ఉండ‌డంతో దురంధ‌ర్ మూవీకి సీక్వెల్ గా దురంధ‌ర్ -2 తీసుకు వ‌చ్చాడు. ఆ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌థ మీద ఎంత న‌మ్మ‌కం ఉంటే కానీ నాలుగు గంట‌ల పాటు సినిమా తీశాడు.

త‌న సినిమాపై, త‌న క‌థ‌పై, త‌న క్యారెక్ట‌ర్లు ఎక్క‌డా చెక్కు చెద‌ర‌కుండా అద్భుతంగా చిత్రీక‌రించాడు ఆదిత్య ధ‌ర్. రెండున్న‌ర గంట‌ల సినిమాలో అక్క‌డ‌క్క‌డ కొన్ని బోరింగ్ మూమెంట్స్ క‌నిపిస్తే, ప్రేక్షకుడు కాస్త ఇబ్బందిగా క‌దులుతాడు. కానీ నాలుగు గంట‌ల సినిమా తీసి, అంద‌రినీ సినిమాకు అతుక్కు పోయేలా చేశాడు. ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్‌లో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లే మూమెంట్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఇందులో ప్ర‌ధానంగా నోట్ల‌ ర‌ద్దు ప్ర‌స్తావ‌న‌, మాధ‌వ‌న్ తో భార‌త్ మాతాకీ జై అనే అనిపించిన క్ష‌ణం బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా ప్రేక్ష‌కుడు ఖ‌ర్చు పెట్టే ప్ర‌తీ రూపాయికీ, థియేట‌ర్లో కూర్చున్న ప్ర‌తీ గంట‌కూ వాల్యూ ఇచ్చే సినిమా తీశాడు ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్.

Exit mobile version