Lemon Water – Effective Update : నిమ్మరసం ఖాళీ కడుపుతో తాగడం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి

జాగ్రత్తలు పాటించకపోతే శరీరానికి అనేక రకాల ప్రతికూల ప్రభావాలు..

Hello Telugu - Lemon Water - Effective Update

Hello Telugu - Lemon Water - Effective Update

Lemon Water : నిమ్మరసం అనేది ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థంగా అందరూ భావిస్తారు. ఇది బరువు తగ్గించడంలో, రోగనిరోధక శక్తి పెంపులో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయకరంగా ఉంటుందని నమ్మకం ఉంది. అయితే దీనిని తీసుకునే పద్ధతిలో జాగ్రత్తలు పాటించకపోతే శరీరానికి అనేక రకాల ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Lemon Water – ఖాళీ కడుపుతో తాగితే ఎముకల బలం దెబ్బతింటుంది

వైద్యుల ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం (Lemon Water) తాగితే అందులోని ఆమ్ల పదార్థాలు శరీరంలోని ఖనిజాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఎముకల్లోని కాల్షియంపై దీని ప్రభావం పడుతుంది. దీని వల్ల ఎముకల బలం తగ్గి, వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

దంత ఆరోగ్యంపై ప్రభావం

నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం దంతాలపై ప్రభావం చూపుతుంది. ఇది పళ్లను కాపాడే ఎనామెల్‌ను కొద్దిగా కొద్దిగా ధ్వంసం చేస్తుంది. దీని ఫలితంగా పళ్లు సున్నితంగా మారి దంత క్షయం జరగవచ్చు. నిమ్మరసం తాగిన వెంటనే నోటిని శుభ్రంగా కడగాలని నిపుణులు సూచిస్తున్నారు.

డీహైడ్రేషన్ ప్రమాదం

నిమ్మరసంలోని (Lemon Water) ఆస్కార్బిక్ యాసిడ్ మూత్ర విసర్జనను పెంచే లక్షణం కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని జల స్థాయిని తగ్గించే ప్రమాదం ఉంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం

నిమ్మరసం జీర్ణక్రియకు ఉపయోగపడుతుందని భావించినా, ఖాళీ కడుపుతో తాగితే కడుపులో ఆమ్ల ఉత్పత్తి పెరిగి గ్యాస్, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాలపై ఒత్తిడి పెరగొచ్చు

నిత్యం అధిక మోతాదులో నిమ్మరసం తీసుకోవడం మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించవచ్చు. ఇది కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల పనితీరును దెబ్బతీయవచ్చు. అందుకే మితంగా మాత్రమే తీసుకోవాలని సూచన.

నిమ్మరసం తాగే సరైన సమయం ఏది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిమ్మరసాన్ని భోజనం తర్వాత లేదా ఆహారంతో కలిపి తీసుకోవడం ఉత్తమం. అలాగే నిమ్మరసం తీసుకున్న వెంటనే పాలు, పెరుగు లేదా ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి.

డాక్టర్ల సూచన మేరకు మితంగా తీసుకోవాలి

ఆరోగ్య ప్రయోజనాల కోసం నిమ్మరసాన్ని తీసుకోవాలనుకునే వారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మేలు. సరైన సమయం, మోతాదులో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అవగాహన లేకుండా తాగితే ఇది శరీరానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది.

Also Read : Badam Shocking Facts : ఈ ఇబ్బంది ఉన్నవారు బాదం ఎట్టిపరిస్థితుల్లో ముట్టుకోకూడదు

Exit mobile version