KTR : హైదరాబాద్ : ఈ దేశాభివృద్ది యువత చేతుల్లోనే ఉందని, దానిని విస్మరిస్తే ప్రమాదమని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). జెన్ జీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దని పిలుపునిచ్చారు పాక్‌తో కాదు పశ్చిమ దేశాలతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. భారతీయుల చైనా, జపాన్ దేశాలను చూసి నేర్చుకోవాలని సూచించారు. మోదీది పర్సెప్షన్ మీడియా మేనేజ్‌మెంటేనని ఎండగట్టారు. మందిర్ మస్జిద్ కాదు మౌలిక వసతులే ముఖ్యం అని స్పష్టం చేశారు. తెలంగాణలో రీకాల్, రీగ్రెట్, రివోల్ట్ నడుస్తోందని చెప్పారు కేటీఆర్. ఎన్డీటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు.
KTR Key Comments on Gen-z
ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మస్జిద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోడీ గాలికి వదిలి వేశారని మండిపడ్డారు కేటీఆర్. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదన్నారు.
Also Read : Oscar 2025-Pushpa 2 Sensational : ఆస్కార్ అవార్డుల రేసులో పుష్ప2, కుబేర
