Oscar 2025-Pushpa 2 Sensational : ఆస్కార్ అవార్డుల రేసులో పుష్ప‌2, కుబేర

క‌న్న‌ప్ప‌, సంకాంత్రికి వ‌స్తున్నాం, గాంధీ తాత చెట్టు

Hello Telugu - Oscar 2025-Pushpa 2 Sensational

Hello Telugu - Oscar 2025-Pushpa 2 Sensational

Pushpa 2 : హైద‌రాబాద్ : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ అవార్డుల రేసులో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లు సినిమాలు నిలిచాయి. ఇప్ప‌టికే హిందీ నుంచి జాహ్న‌వి కపూర్ కీల‌క పాత్ర పోషించిన హోమ్ బౌండ్ ఏకైక చిత్రంగా ఎంపికైంది ఆస్కార్ కోసం. సింగ‌పూర్ వేదిక‌గా జ్యూరీ ఎంపిక క‌మిటీ చైర్మ‌న్ చంద్ర ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మ‌రో వైపు తెలుగు భాషా ప‌రంగా తీసిన సినిమాలు కూడా ఆస్కార్ పుర‌స్కారాల రేసులో నిలవ‌డం విశేషం. ఇందులో ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ద‌మ్మున్న డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసిన పుష్ప 2 (Pushpa 2) తో పాటు ప‌లు సినిమాలు కూడా నిలిచాయి. ఇందులో అల్లు అర్జున్ తో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్ పోషించింది. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన సినిమాల‌లో 2వ సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇది అరుదైన రికార్డు ఏకంగా రూ. 1768 కోట్లు వ‌సూలు చేసిందని ప్ర‌క‌టించారు మూవీ నిర్మాతలు.

Pushpa 2 in Oscar 2025 List

ప్ర‌ముఖ న‌టుడు మంచు మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణ సార‌థ్యంలో మంచు విష్ణు, మోహ‌న్ లాల్, త‌దిత‌రులు న‌టించిన క‌న్న‌ప్ప కూడా ఆస్కార్ రేసులో నిలిచింది. మ‌రో వైపు సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కుబేర కూడా ఎంపికైంది. ఇందులో త‌మిళ సినీ న‌టుడు, ద‌ర్శ‌కుడు ధ‌నుష్ తో పాటు నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ముఖ్య పాత్ర‌లు పోషించారు. త‌క్కువ బ‌డ్జెట్ తో తీసిన ఈ మూవీ రూ. 100 కోట్లు వ‌సూలు చేసింది. ఇక టాలీవుడ్ లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి. ఆయ‌న ప్ర‌తి సినిమా బ్లాక్ బ‌స్టర్ . తాజాగా త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమా కూడా ఆస్కార్ కు ఎంపికైంది. చివ‌రగా సుకుమార్ కూతురు న‌టించిన గాంధీ తాత చెట్టు కూడా మంచి ఆద‌ర‌ణ పొందింది. ఇది కూడా లిస్టులో ఉండ‌డం విశేషం.

Also Read : Vice President Radhakrishnan Important : విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు రాధాకృష్ణ‌న్ కు ఆహ్వానం

Exit mobile version