బాలిక‌పై డాక్ట‌ర్ రేప్ మహిళా క‌మిష‌న్ ఫైర్

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం

Renubhatia

హ‌ర్యానా : హ‌ర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహిళా వైద్యులు, నర్సులు ఉన్నా.. మైనర్ బాలికపై ఘోరం జ‌రిగింది. ఆసుపత్రిని దేవాలయంగా, డాక్టర్లను దేవుళ్లుగా నమ్ముతాం. కానీ, ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన చోటే దారుణం జరగ‌డం ఇప్పుడు రాష్ట్ర‌మంత‌టా, దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.
హర్యానా కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై డాక్టర్ శైలేంద్ర కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.

ఆసుపత్రిలో PMO గా ఒక మహిళ ఉన్నా, ఓపీడీలో మహిళా నర్సులు అందుబాటులో ఉన్నా.. ఒక కామాంధుడు తన పనిని ఎలా పూర్తి చేయగలిగాడనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మైనర్ బాలికను పరీక్షించేటప్పుడు కనీస నిబంధనలు పాటించక పోవడం, వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. విష‌యం తెలిసిన హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా అక్క‌డికి చేరుకుంది. సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందించక పోవడం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిందితుడిని పెంచి పోషించిన ఆసుపత్రి యంత్రాంగంపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Exit mobile version