DK Shivakumar : బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం మరింత వేడెక్కింది. సీఎంగా తాను కూడా రేసులో ఉన్నానంటూ మరోసారి కామెంట్స్ చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar). దీంతో ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదే సమయంలో కొందరు గ్రూపులుగా విడి పోవడం, చర్చలు జరపడంతో సీఎం గా ఉన్న సిద్దరామయ్యను మారుస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన 140 మంది ఎమ్మెల్యేలంతా తనకు సంబంధించిన వారేనని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా పార్టీ పరంగా కాకుండా తనకంటూ ఓ గ్రూప్ ఏర్పాటు చేసే అలవాటు తనకు లేదని అన్నారు.
DK Shivakumar Key Comments on CM Position
మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించు కున్నారని పేర్కొన్నారు. అందరూ మంత్రులు కావాలని కోరుకుంటారని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు డీకే శివకుమార్. కాబట్టి వారు ఢిల్లీలో నాయకత్వాన్ని కలవడం చాలా సహజం అని స్పష్టం చేశారు. అది వారి హక్కు. మనం వారిని ఆపలేం అలాగని వారిని వద్దని కూడా చెప్పలేమన్నారు. సిద్దరామయ్య 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పారు. ఆయనకు శుభాకాంక్షలు. మేమంతా ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తామిద్దరం పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని అన్నారు డీకే శివకుమార్. చాలా ఏళ్లవుతోంది నేను కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉండి. అందుకే రాజీనామా చేశానని తెలిపారు.
Also Read : CS Ramakrishna Sensational Update : తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ
