DK Shivakumar Important Update : సీఎం మార్పుపై పార్టీ హైక‌మాండ్ దే ఫైన‌ల్

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డికే శివ‌కుమార్

Hello Telugu - DK Shivakumar Important Update

Hello Telugu - DK Shivakumar Important Update

DK Shivakumar : బెంగళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి విష‌యంలో మ‌రోసారి సిద్ద‌రామ‌య్య వ‌ర్సెస్ డీకే శివ‌కుమార్ (DK Shivakumar) వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఈ వివాదానికి తెర దించేందుకు నానా తంటాలు ప‌డుతోంది ఏఐసీసీ హైక‌మాండ్. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు పంచాయ‌తీ చేరింది. ఆయ‌న బిజీగా ఉండ‌డంతో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని క‌ర్ణాట‌క‌కు చెందిన ఏఐసీసీ బాస్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు అప్ప‌గించారు. దీంతో ప్ర‌స్తుతం బంతి ఖ‌ర్గే గ్రౌండ్ లో ఉంది. ఆయ‌న కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క సీఎం మార్పు విష‌యం ఇంకా చ‌ర్చ‌కు రాలేద‌న్నారు. ఇందుకు సంబంధించి కీల‌క స‌మావేశం ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. ఈ విష‌యం గురించి అంత‌గా ఆలోచించాల్సిన ప‌ని లేద‌న్నారు.

DY CM DK Shivakumar Key Comments on CM Issue

మ‌రో వైపు సీఎం మార్పు విష‌యంపై మీరు క‌న్నేశారా అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే చేసిన ప్ర‌క‌ట‌న‌పై స్పందించారు. ఇవాళ డీకే మీడియాతో మాట్లాడారు. సీఎం ప‌ద‌వి కంటే పార్టీ ముఖ్యం. వ్య‌క్తులు ఎవ‌రు అన్న‌ది ముఖ్యం కాద‌న్నారు . సీఎం పోస్టుపై తాను ఇప్పుడు ఏమీ వ్యాఖ్యానించద‌ల్చు కోలేద‌న్నారు. ఈ స‌మ‌యంలో తాను మాట్లాడటం బాగుండ‌ద‌న్నారు. పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం మేమంతా క‌లిసి ప‌ని చేస్తామ‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. వ్య‌క్తిగ‌త విష‌యాల కంటే త‌మ పార్టీ ముందుకు వెళ్ల‌డం ముఖ్య‌మ‌ని తాను భావిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణ‌యం తీసుకుంటే దానికి తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : KTR Shocking Comments on CM : రేవంత్ రెడ్డి సీఎం కాదు రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్

Exit mobile version