KTR : హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). తను రాష్ట్రానికి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నాడని, పాలన సాగిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఒక రకంగా తాను సీఎం కానే కాదని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తులైన 9,300 ఎకరాలకు చెందిన పారిశ్రామిక భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. దీని వల్ల దాదాపు రూ. 5 లక్షల కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేశాడని, కానీ దానిని అడ్డుకుని తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఆరు గ్యారెంటీలంటూ , 420 ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
KTR Slams CM Revanth Reddy
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని మాయ మాటలు చెప్పిన సర్కార్ ఇప్పుడు కేవలం 17 శాతం మాత్రమే ఇస్తామని చెప్పడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తానికి హ్యాండ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్పా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీల చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు.
Also Read : Kadiyam Srihari Shocking Comments on KCR : కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుంది
