CM Siddaramaiah : బెంగళూరు : కర్ణాటకలో నిన్నటి దాకా రసవత్తరంగా మారిన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ప్రస్తుత సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాజాగా రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పక ఉంటుందని, ఈ మేరకు డీకే శివకుమార్ ను సీఎంగా ఎంపిక చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో కొలువుతీరిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆధ్వర్యంలో. ఈ మేరకు తన సారథ్యంలో పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అనూహ్యంగా తనపై కేసులు ఉండడంతో సీఎం పోస్టును సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, పార్టీకి విధేయుడిగా పేరు పొందిన సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పోస్టు దక్కింది. అయితే చివరి దాకా ప్రయత్నం చేసిన డీకేను బుజ్జగించారు పార్టీ సీనియర్ అధినేత సోనియా గాంధీ.
CM Siddaramaiah – DK Shivakumar Important Meeting
ఈ మేరకు ఆమె చేసిన సూచనల మేరకు 5 ఏళ్ల పవర్ ను చెరో రెండున్నర ఏళ్లు పంచుకునేలా, పాలన సాగించేలా ఢిల్లీ కేంద్రంగా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా రాజకీయ పరంగా సీఎం పోస్టును మారుస్తారంటూ పెద్ద ఎత్తున చర్చలు కొనసాగాయి. దీంతో ప్రస్తుతం పార్టీలో సీఎం గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూపులుగా విడి పోయారు. దీంతో ప్రభుత్వం కూలి పోతుందన్న అనుమానం నెలకొంది. దీనిపై హైకమాండ్ రంగంలోకి దిగింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో మాట్లాడింది. చివరకు సోనియా గాంధీ నిర్ణయమే ఫైనల్ అంటూ ఇద్దరూ ప్రకటించారు. ఈ మేరకు శనివారం స్వయంగా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రావాల్సిందిగా సిద్దరామయ్య ఆహ్వానించారు డీకే శివకుమార్ ను. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Also Read : CM Revanth Reddy Important Visit : ప్రజా వారోత్సవాలలో సీఎం రేవంత్ పర్యటన
