Divya Deshmukh Growth – Chess Champion : చెస్ ఛాంపియ‌న్ గా దివ్య దేశ్ ముఖ్

డాక్ట‌ర్ కావాల‌ని అనుకుంది

Hello Telugu - Divya Deshmukh Growth - Chess Champion

Hello Telugu - Divya Deshmukh Growth - Chess Champion

Divya Deshmukh : ముంబై – ఫిడే మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించంది ముంబైకి చెందిన దివ్య దేశ్ ముఖ్ (Divya Deshmukh). ప్ర‌స్తుతం త‌న పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. 19 ఏళ్ల‌కే భార‌త గ్రాండ్ మాస్ట‌ర్ గా రికార్డ్ న‌మోదు చేసింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు డాక్ట‌ర్ కావాల‌ని కోరిక ఉంద‌ని, కానీ చెస్ వైపు అడుగులు వేశానంటూ తెలిపింది. ఏడేళ్ల‌ప్ప‌టి నుంచే త‌న‌కు చ‌ద‌రంగంపై ఆస‌క్తి పెరిగింద‌ని , అప్ప‌టి నుంచే దానిపై ఫోక‌స్ పెడుతూ వ‌చ్చాన‌ని పేర్కొంది.

Divya Deshmukh As A Chess Champion

త‌ను ఏపీకి చెందిన గ్రాండ్ మాస్ట‌ర్ కోనేరు హంపిని ఓడించింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. భార‌తీయ చెస్ రంగంలో మ‌హిళ‌ల కేట‌గిరీలో అతి త‌క్కువ వ‌య‌సులో ఛాంపియన్ కావ‌డం విశేషం. సోద‌రి బ్యాడ్మింట‌న్ ఆడుతుంటే త‌న ఎత్తు త‌క్కువ‌గా ఉండ‌డంతో పక్క‌నే ఉన్న భ‌వ‌నంలో చెస్ ఆడుతున్న వాళ్ల‌ను చూసింది. ఆ రోజు నుంచి చెస్ ప‌ట్ల మ‌క్కువ పెంచుకుంది. పేరెంట్స్ కూడా త‌న‌కు స‌హ‌క‌రించ‌డంతో ఇది సాధ్య‌మైంద‌ని చెప్పింది దివ్య దేశ్ ముఖ్.

త‌న వెనుక అద్భుత‌మైన చ‌రిత్ర ఉంది. త‌ను ఏడు సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడే నేష‌న‌ల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. అప్పుడే ప్ర‌తి ఒక్క‌రి దృష్టి త‌న‌పై ప‌డింది. 2021లో మ‌హిళ‌ల గ్రాండ్ మాస్ట‌ర్ గా గెలుపొందింది. అదే ఏడు మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్టర్స్ విజేత‌గా నిలిచింది. ఫిడే చెస్ ఒలింపియాడ్ లో భార‌త టీంలో ముఖ్య భూమిక పోషించింది దివ్య దేశ్ ముఖ్. టైటిల్ పోరులో కోనేరు హంపికి షాక్ ఇచ్చింది. 88వ గ్రాండ్ మాస్ట‌ర్ గా నిలిచింది. కొత్త ప్ర‌దేశాలు చూడ‌డం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం త‌న హాబీ.

Also Read : Jajula Srinivas Goud Shocking Comments : బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

Exit mobile version